త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mirchi Bajji | మిర్చి బ‌జ్జీల్లో ఇన్ని ర‌కాలు ఉన్నాయా.. ఘాటులో వీటికి పోటీ లేవు ఏవీ..

Mirchi Bajji | మిర్చి.. లేదా మిర్చి బ‌జ్జీ.. ఎలా పిలిచినా స‌రే దేశ‌వ్యాప్తంగా ఇది చాలా మందికి ఫేవ‌రెట్ స్నాక్‌. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తిందామ‌ని ఆలోచిస్తే ముందుగా మిర్చి బ‌జ్జీలే గుర్తుకు వ‌స్తాయి. అంత‌లా ఇవి పాపుల‌ర్ అయ్యాయి. ప‌చ్చిమిర్చిని శ‌న‌గ‌పిండిలో ముంచి త‌రువాత నూనెలో వేయించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది.

S

Food | Published On Apr 26, 2026, 12.06 pm IST

Mirchi Bajji | మిర్చి బ‌జ్జీల్లో ఇన్ని ర‌కాలు ఉన్నాయా.. ఘాటులో వీటికి పోటీ లేవు ఏవీ..
Advertisement

Mirchi Bajji | మిర్చి.. లేదా మిర్చి బ‌జ్జీ.. ఎలా పిలిచినా స‌రే దేశ‌వ్యాప్తంగా ఇది చాలా మందికి ఫేవ‌రెట్ స్నాక్‌. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తిందామ‌ని ఆలోచిస్తే ముందుగా మిర్చి బ‌జ్జీలే గుర్తుకు వ‌స్తాయి. అంత‌లా ఇవి పాపుల‌ర్ అయ్యాయి. ప‌చ్చిమిర్చిని శ‌న‌గ‌పిండిలో ముంచి త‌రువాత నూనెలో వేయించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. మిర్చి బజ్జీని దేశ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భిన్న ర‌కాలుగా త‌యారు చేస్తారు. కొన్ని చోట్ల ఘాటుగా కారంగా ఉంటే, కొన్ని చోట్ల సాధార‌ణ చిరుతిండిలా టేస్ట్ ఉంటుంది. ర‌హ‌దారి ప‌క్క‌న మిర్చి బ‌జ్జీల‌ను వేస్తుంటే వ‌చ్చే వాస‌న‌కే చాలా మంది ఫిదా అవుతుంటారు. సాయంత్రం స‌మ‌యంలో టీ తాగుతూ మిర్చి బజ్జీ రుచిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా మంది దాదాపుగా ఒక‌టి లేదా రెండు ర‌కాల మిర్చి బ‌జ్జీల‌ను మాత్ర‌మే తిని ఉంటారు. కానీ దేశంలో మొత్తం 7 ర‌కాల మిర్చి బ‌జ్జీలు ప్ర‌ధానంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు వాటిని ఇష్టంగా తింటుంటారు.

ఘాటుకు ఫేమ‌స్ తెలంగాణ‌, ఆంధ్ర‌, రాజ‌స్థాన్‌..

ఉమ్మ‌డి ఏపీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మిర్చి బ‌జ్జీ త‌యారీ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అయితే కొంద‌రు ఆంధ్ర స్టైల్ మిర్చి బ‌జ్జీని ఇష్ట‌పడితే, కొంద‌రికి తెలంగాణ స్ట‌ఫ్డ్ మిర్చి బ‌జ్జీ నచ్చుతుంది. ఆంధ్ర స్టైల్‌లో త‌యారు చేసే మిర్చి బ‌జ్జీలో మిర్చి బ‌జ్జీని వేయించాక అందులో మ‌ధ్య‌కు చీల్చి ఉల్లిపాయ‌, చింత‌పండు ర‌సం, ప‌ల్లీల మ‌సాలా పెట్టి నింపుతారు. ఇక తెలంగాణ స్టైల్‌లో అయితే ఉల్లిపాయ‌, ఆలుగ‌డ్డ మిశ్ర‌మం నింపుతారు. దీని వ‌ల్ల బ‌జ్జీ క‌ర‌క‌ర‌లాడుతుంది. లోప‌లి స్ట‌ఫ్ ఎంతో రుచిగా ఉంటుంది. వీటిల్లో వాడే ప‌దార్థాలు కాస్త భిన్నంగా ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం దేనిక‌దే ప్ర‌త్యేకం అని చెప్పాలి. ఇక రాజ‌స్థాన్‌లో మిర్చి బ‌జ్జీ చాలా పెద్ద‌గా, బ‌రువుగా ఉంటుంది. దీన్ని అక్క‌డ మిర్చి వ‌డా అని పిలుస్తారు. అందులో సోంపు, ధ‌నియాలు, మిర్చి పొడి, ఆలుగ‌డ్డ మ‌సాలా నింపుతారు. బంగారు రంగులో వేయించి క‌ర‌క‌ర‌లాడేలా చేసిస్తారు. మ‌సాలా అధికంగా ఉంటుంది క‌నుక కాస్త ఘాటుగా అనిపిస్తుంది. అయిప్ప‌టికీ రుచి అద్భుతంగా ఉంటుంది.

క‌ర్ణాట‌క‌, త‌మిళులు త‌క్కువ‌గానే..

క‌ర్ణాట‌క‌లో మిర్చి బ‌జ్జీల‌ను చాలా సింపుల్‌గా చేస్తారు. పొడ‌వైన మిర్చిని వాడుతారు. వాటిని పిండిలో ముంచి వేయించాక మ‌ధ్య‌లో ఎక్కువ మ‌సాలా వాడ‌కుండా మిర్చి రుచి తెలిసేలా ఇత‌ర ప‌దార్థాల‌ను క‌లుపుతారు. దీంతో ఇది కూడా కాస్త ఘాటుగానే ఉంటుంది. అయితే ఈ మిర్చి బ‌జ్జీల‌ను వారు కొబ్బ‌రి చ‌ట్నీతో తింటారు. ఇక త‌మిళ‌నాడులో మిర్చి బ‌జ్జీని మిల‌గై బ‌జ్జీ అని పిలుస్తారు. ఇది కాస్త త‌క్కువ కారంగా, ఘాటు త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల చిన్నారులు, కారం అంటే ప‌డనివారు కూడా సుల‌భంగా తిన‌వ‌చ్చు. త‌క్కువ మ‌సాలా వాడుతారు. సాధార‌ణంగా చాలా మంది అక్క‌డ దీన్ని సాయంత్రం స‌మ‌యంలో ఎక్కువ‌గా తింటుంటారు.

వీరికి ఇది అల్పాహారం..

మ‌హారాష్ట్ర‌లో త‌యారు చేసే మిర్చి బ‌జ్జీని మిర్జి భాజీ అని పిలుస్తారు. ఇది క‌ర‌క‌ర‌లాడే టెక్స్చర్‌ను క‌లిగి ఉంటుంది. గ‌ట్టిగా ఉండే మ‌సాలాను ఇందులో వాడుతారు. మిర్చిని స్వ‌ల్పంగా చీల్చి మ‌సాలా పిండిలో ముంచి వేయిస్తారు. సాధార‌ణంగా పావ్‌తో దీన్ని వ‌డ్డిస్తారు. దీన్ని కొంద‌రు అల్పాహారంగా కూడా తింటారు. గ్రీన్ చ‌ట్నీ, డ్రై గార్లిక్ చ‌ట్నీతో తింటే రుచిగా ఉంటుంది. చ‌ల్ల‌ని ప‌ర్వ‌త ప్రాంతాల‌కు నెల‌వుగా ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో మిర్చి బ‌జ్జీల‌కు డిమాండ్ ఎక్కువే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో స్థానికులే కాదు, టూరిస్టులు కూడా ఇక్క‌డి చిల్లీ ప‌కోరాల‌ను తినేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. వీటిని తేలిక‌పాటి పిండితో వేయించి క‌ర‌క‌ర‌లాడేలా త‌యారు చేస్తారు. త‌క్కువ కారంతో ఉంటాయి. వేడి వేడి టీ తో వీటిని ఆస్వాదిస్తారు. అయితే మిర్చి బ‌జ్జీ ఒక సాధార‌ణ స్నాక్ అయినా దేశంలో అనేక ప్రాంతాల్లో భిన్న ర‌కాల రుచుల‌ను ఇది క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల ఆయా ప్రాంతాల‌కు వెళితే లోక‌ల్ మిర్చి బ‌జ్జీ ప‌ర్యాట‌కుల‌కు అద్భుత‌మైన టేస్ట్‌ను అందిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement