Detox Drinks | ఈ డిటాక్స్ డ్రింక్స్‌ను ట్రై చేయండి.. దెబ్బకు హ్యాంగోవర్ సమస్యలన్నీ మాయమవుతాయి..
Detox Drinks | నూతన సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ముగిశాయి. పార్టీ పక్షులు అందరూ వినోదాల్లో మునిగి తేలారు. మద్యాన్ని ఏరులై పారించారు. ఎప్పటిలాగే న్యూ ఇయర్ వేడుకల్లో ఆడిపాడారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ న్యూ ఇయర్ రోజు ఉదయం వచ్చే హ్యాంగోవర్ మామూలుగా ఉండదు.
Detox Drinks | నూతన సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ముగిశాయి. పార్టీ పక్షులు అందరూ వినోదాల్లో మునిగి తేలారు. మద్యాన్ని ఏరులై పారించారు. ఎప్పటిలాగే న్యూ ఇయర్ వేడుకల్లో ఆడిపాడారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ న్యూ ఇయర్ రోజు ఉదయం వచ్చే హ్యాంగోవర్ మామూలుగా ఉండదు. ముందు రోజు రాత్రి భారీ డీజే శబ్దాల నడుమ అలుపెరగకుండా డ్యాన్సులు చేయడం, విపరీతంగా మద్యం సేవించడం కారణంగా శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శబ్దం, ఆల్కహాల్.. ఇవి రెండూ మరుసటి రోజు మనల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. అయితే ఇలాంటి సమయంలో మన శరీరానికి రిఫ్రెష్మెంట్ లభించాలి. తలనొప్పి, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు అన్నీ తొలగిపోయి మళ్లీ మామూలుగా మారాలి. ఇందుకు గాను మన శరీరాన్ని డిటాక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇందుకు గాను పలు డ్రింక్స్ పనిచేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరినీటిలో రాక్ సాల్ట్..
న్యూ ఇయర్ పార్టీ అనంతరం వచ్చే శారీరక, మానసిక సమస్యలను పోగొట్టుకునేందుకు పలు డ్రింక్స్ పనిచేస్తాయని న్యూట్రిషనిస్టు రూపాలి దత్తా తెలిపారు. ఇక ఆ డ్రింక్స్‌లో నిమ్మకాయ నీళ్లు మొదటి స్థానంలో నిలుస్తాయని తెలిపారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి తాగితే ఎంతో తాజాదనం లభిస్తుందని చెప్పారు. ఈ డ్రింక్ వల్ల వికారం, కడుపు ఉబ్బరం వంటి హ్యాంగోవర్ సమస్యలు తగ్గుతాయి. అలాగే అసిడిటీ, పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతాయి. బాడీ డిటాక్స్ అవుతుంది. మళ్లీ ఉత్తేజం లభిస్తుంది. అలాగే శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కొబ్బరి నీళ్లు కూడా పనిచేస్తాయి. ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి తాగాలి. దీని వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. ఇవి డీహైడ్రేషన్, తలనొప్పి తగ్గేలా చేస్తాయి. దీంతో హ్యాంగోవర్ తగ్గిపోతుంది. అలాగే నీరసం, తలతిరగడం, నోరు పొడిబారడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మళ్లీ ఉత్సాహంగా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది.

అల్లం, తేనె నీళ్లు..
మద్యం సేవించిన అనంతరం వచ్చే హ్యాంగోవర్‌ను తగ్గించడంతోపాటు మళ్లీ శక్తి వచ్చేలా చేయడంలో అల్లం, తేనె నీళ్లు కూడా ఎంతగానో సహాయం చేస్తాయి. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో కొద్దిగా తురిమిన అల్లం వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. ఈ డ్రింక్ వల్ల కూడా శరీరం డిటాక్స్ అవుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ తగ్గుతుంది. జీర్ణాశయ పొర రక్షించబడుతుంది. అల్సర్ రాకుండా చూసుకోవచ్చు. తేనె వల్ల శరీరానికి సహజసిద్ధంగా శక్తి కూడా లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి.
కీరదోస, పుదీనా..
కీరదోసను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. అందులోనే కొన్ని పుదీనా ఆకులను కూడా వేయాలి. అనంతరం వాటిని మిక్సీ పట్టి జ్యూస్ తయారు చేయాలి. దాన్ని ఒక కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలిపి తాగేయాలి. ఇది కూడా చాలా శక్తివంతమైన డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి క్లీన్ అవుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల ఉసిరికాయ రసాన్ని కలిపి తాగినా కూడా ఉపయోగం ఉంటుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఉసిరి రసం అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని వాపులను సైతం ఇది తగ్గిస్తుంది. ఇలా ఆయా డ్రింక్‌లు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రంగా మారుస్తాయి. దీంతో హ్యాంగోవర్ సమస్యల నుంచి బయట పడవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్



