Ozempic | ఇక పెంపుడు జంతువులకు సైతం బరువు తగ్గించే మందులు.. పరిశోధన చేస్తున్న నిపుణులు..
Ozempic | మానవుల్లో బరువు తగ్గించడంలో సంచలనం సృష్టించిన ఓజెంపిక్, వెగోవీ తరహా మందులు భవిష్యత్తులో పెంపుడు జంతువులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. అమెరికాలో ఇప్పటికే ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నట్లు సీఎన్‌బీసీ తెలిపింది.
Ozempic | మానవుల్లో బరువు తగ్గించడంలో సంచలనం సృష్టించిన ఓజెంపిక్, వెగోవీ తరహా మందులు భవిష్యత్తులో పెంపుడు జంతువులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. అమెరికాలో ఇప్పటికే ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నట్లు సీఎన్‌బీసీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల్లో ఊబకాయం (ఒబెసిటీ) పెరుగుతున్న సమస్యగా మారుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెంపుడు జంతువుల యజమానులు ప్రీమియం పోషకాహారం, ఆధునిక వెటర్నరీ వైద్య సేవలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధనలకు ప్రాధాన్యం పెరిగింది. అమెరికాకు చెందిన ఆక్స్టన్ బయోసైన్సెస్ సంస్థ, కార్నెల్ యూనివర్సిటీలో అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్న పిల్లులపై వారానికి ఒకసారి ఇచ్చే జీఎల్‌పీ-1 చికిత్సను పరీక్షిస్తోంది.
క్లినికల్ ట్రయల్స్ దశలో..
అలాగే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓకావా ఫార్మాస్యూటికల్స్ సంస్థ, ఒకసారి అమర్చిన తర్వాత ఆరు నెలల వరకు నిరంతరాయంగా ఔషధాన్ని విడుదల చేసే దీర్ఘకాలిక ఇంప్లాంట్‌ను పరీక్షిస్తోంది. అయితే ఈ రెండు చికిత్సలకూ ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రస్తుతం పెంపుడు జంతువుల కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న జీఎల్‌పీ-1 బరువు తగ్గించే మందులు లేవు. ఈ రెండు ఔషధాలు ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉండగా, అవి సురక్షితమని, సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపితమైన తర్వాతే వెటర్నరీ ఆసుపత్రుల్లో ఉపయోగించే అవకాశం ఉంటుంది. మానవుల్లో నోవో నోర్డిస్క్ తయారు చేసిన ఓజెంపిక్, వెగోవీ, అలాగే ఈలై లిల్లీ తయారు చేసిన మౌంజారో, జెప్‌బౌండ్ వంటి జీఎల్‌పీ-1 మందులు ఊబకాయం చికిత్సలో విశేష విజయాన్ని సాధించడంతో ఈ పరిశోధనలకు ఊతం లభించింది.
అధికమవుతున్న ఊబకాయం సమస్య..
పెంపుడు జంతువుల్లో కూడా ఊబకాయం తీవ్ర సమస్యగానే ఉంది. అసోసియేషన్ ఫర్ పెట్ ఒబెసిటీ ప్రివెన్షన్ గణాంకాల ప్రకారం 2022లో అమెరికా వెటర్నరీ నిపుణులు పరిశీలించిన పిల్లుల్లో 61 శాతం, కుక్కల్లో 59 శాతం అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవిగా గుర్తించారు. పెంపుడు జంతువుల్లో అధిక బరువు కారణంగా ఆర్థ్రైటిస్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. అయితే భారత్‌లోని పెంపుడు జంతువులకు ఈ తరహా చికిత్సలు ఇప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం భారత్‌లో పెంపుడు జంతువుల కోసం జీఎల్‌పీ-1 థెరపీకి కూడా అనుమతి లేదు. వెటర్నరీ వైద్యులు ఇప్పటికీ సమతుల్య పోషకాహారం, సరైన పరిమాణంలో ఆహారం ఇవ్వడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయించడం ద్వారా పెంపుడు జంతువుల బరువును నియంత్రించాలని సూచిస్తున్నారు.
ఊబకాయం చికిత్సకు త్వరలో మందులు..
అయితే ప్రపంచవ్యాప్తంగా పెట్ కేర్ పరిశ్రమ క్రమంగా నివారణ ఆధారిత ఆరోగ్య సంరక్షణ వైపు అడుగులు వేస్తోంది. మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకుడు సిమియోన్ గుట్‌మన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రీమియం పెట్ ఫుడ్‌తోపాటు డయాగ్నోస్టిక్స్, చికిత్సా పోషకాహారం, వెటర్నరీ సేవలపై ఖర్చు పెరుగుతోంది. పెంపుడు జంతువుల దీర్ఘాయుష్షు కూడా ప్రధాన లక్ష్యంగా మారుతోంది. ఇదే సమయంలో నెస్లే ప్యూరినా, హిల్స్ పెట్ న్యూట్రిషన్, ఫ్రెష్‌పెట్ వంటి సంస్థలు ఆరోగ్యంపై దృష్టి సారించిన పోషకాహార ఉత్పత్తులను విస్తరిస్తున్నాయి. అలాగే జోయెటిస్, ఎలాంకో, ఐడెక్స్ వంటి యానిమల్ హెల్త్ కంపెనీలు ఆధునిక వెటర్నరీ చికిత్సలకు పెరుగుతున్న డిమాండ్‌తో ప్రయోజనం పొందే అవకాశం ఉందని సీఎన్‌బీసీ పేర్కొంది. ప్రస్తుతం పెంపుడు జంతువుల కోసం ఓజెంపిక్ భవిష్యత్తు అవకాశంగా మాత్రమే ఉన్నప్పటికీ, కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే వెటర్నరీ వైద్యరంగంలో ఊబకాయం చికిత్సకు కొత్త తరహా మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్‌పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
జూన్ 27, 2026

Wegovy Pill | ట్యాబ్లెట్తోనే అధిక బరువు తగ్గింపు.. కొత్త వెగోవీ స్టడీ సంచలనం..
మే 14, 2026

Semaglutide | రూ.10వేలు కాదు, రూ.750కే బరువు తగ్గించే ఇంజెక్షన్.. సెమాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్లు వచ్చేశాయ్..
మార్చి 21, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



