Joint Pains | కీళ్ల నొప్పులు, వాపులు తగ్గేందుకు.. ఆర్థోపెడిక్స్ డాక్టర్ చెబుతున్న పరిష్కారం..
Joint Pains | ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి కీళ్ల నొప్పులు సర్వ సాధారణం. ఇవి తరచూ వస్తూనే ఉంటాయి. అయితే నొప్పులతోపాటు వాపులు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఈ వాపులు దీర్ఘకాలంగా ఉంటే కార్టిలేజ్ నెమ్మదిగా దెబ్బ తింటుంది. దీంతో కీళ్లు గట్టి పడతాయి. ఫలితంగా నొప్పులు ఇంకా అధికంగా మారుతాయి.
Joint Pains | ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి కీళ్ల నొప్పులు సర్వ సాధారణం. ఇవి తరచూ వస్తూనే ఉంటాయి. అయితే నొప్పులతోపాటు వాపులు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఈ వాపులు దీర్ఘకాలంగా ఉంటే కార్టిలేజ్ నెమ్మదిగా దెబ్బ తింటుంది. దీంతో కీళ్లు గట్టి పడతాయి. ఫలితంగా నొప్పులు ఇంకా అధికంగా మారుతాయి. అయితే ఈ సమస్యలు ఉన్నవారు సరైన ఆహారం తీసుకుంటే దాంతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని, అలాగే వాపుల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అశ్వని మైచంద్ మాట్లాడుతూ, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలతో పాటు వాపును పెంచే ఆహారాలపై కూడా అవగాహన ఉండాలని సూచించారు. ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ షుగర్, రెడ్ మీట్, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి ఆహారాలు వాపును పెంచి కీళ్ల నొప్పిని తీవ్రతరం చేస్తాయని అన్నారు. అలాగే మద్యం, చక్కెర కలిగిన పానీయాలను తగ్గిస్తే శరీరంలోని వాపుల స్థాయి తగ్గుతుందని అన్నారు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు..
సాల్మన్, మాక్రెల్, సార్డిన్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. వాపులను తగ్గిస్తాయి. అయితే శాకాహారులు చేపలను తినలేరు కనుక వాటికి బదులుగా అవిసె గింజలు, చియా విత్తనాలను, వాల్ నట్స్‌ను తీసుకోవాలి. వీటిల్లో వృక్ష సంబంధిత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కూడా కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. అలాగే బెర్రీ పండ్లు, పాలకూర, కేల్, క్యాప్సికం వంటి రంగు రంగుల కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల కణజాలంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కార్టిలేజ్ దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటుంది. ఈ క్రమంలో రోజూ కనీసం రెండు రకాలకు చెందిన పండ్లు, కూరగాయలను తింటే మేలు జరుగుతుంది.
పసుపు, అల్లం..
మన వంటింట్లో ఉండే పసుపు, అల్లం కూడా కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో, ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు చేయడంలో సహాయం చేస్తాయి. పసుపును రోజూ రాత్రి పాలలో కలిపి తీసుకోవాలి. లేదా గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. అయితే కర్‌క్యుమిన్‌ను మన శరీరం సాధారణంగా చాలా తక్కువగా శోషిచుకుంటుంది. కనుక దీని శోషణ పెరగాలంటే పసుపుతోపాటు మిరియాల పొడిని కూడా కలిపి తీసుకుంటే మంచిది. దీంతో కర్‌క్యుమిన్ శోషణ పెరిగి కీళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే పసుపు లాగే అల్లంలోనూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ రెండు పూటలా భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తుండాలి. లేదా అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
వీటిని మానేయాలి..
కీళ్ల నొప్పులు ఉన్నవారు తెల్ల బ్రెడ్, స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్ వంటి ఆహారాలను తీసుకోకూడదు. ఇవి శరీరంలో వాపులను పెంచుతాయి. వీటిని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. దీని వల్ల కీళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే వేయించిన, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇవి కూడా వాపులను పెంచుతాయి. వీటి స్థానంలో ఉడికించిన లేదా ఆవిరితో తయారు చేసిన ఆహారాలను తింటే మేలు జరుగుతుంది. అలాగే నీళ్లను కూడా రోజూ తగిననంత మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీని వల్ల కీళ్లలో ఉండే కణజాలం మృదువుగా మారుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆయా సూచనలు పాటిస్తూ ఆహారంలో మార్పులు చేసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులను సులభంగా తగ్గించుకోవచ్చని, ఆర్థరైటిస్ తగ్గుతుందని డాక్టర్ అశ్వని మైచంద్ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



