Fruits For Diabetics | డయాబెటిస్ ఉన్న వారు ఏయే పండ్లను తినవచ్చు..? పోషకాహార నిపుణుల సూచనలు..!
Fruits For Diabetics | డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి వచ్చే ప్రధాన సందేహం.. అసలు ఏ పండ్లను తినాలి..? వేటిని పడితే వాటిని తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ వ్యాధి ఉన్నవారు పండ్లను తినే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Fruits For Diabetics | డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి వచ్చే ప్రధాన సందేహం.. అసలు ఏ పండ్లను తినాలి..? వేటిని పడితే వాటిని తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ వ్యాధి ఉన్నవారు పండ్లను తినే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే పండ్లకు సంబంధించి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ తెలుసుకుంటే ఏ పండ్లను తినాలో, వేటిని తినకూడదో ఎవరికి వారు సులభంగా నిర్దారించుకుంటారు. ఈ క్రమంలో తక్కువ జీఐ విలువ పండ్లను తినాలని ఆటోమేటిగ్గా తెలుస్తుంది. తక్కువ జీఐ విలువ ఉంటే అలాంటి పండ్లు షుగర్ లెవల్స్‌ను అకస్మాత్తుగా పెంచవు. పైగా ఆ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. కనుక లో-జీఐ ఉన్న పండ్లను తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
యాపిల్స్..
యాపిల్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. వీటిల్లోనూ అనేక రకాలు ఉంటాయి. అయితే యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిల్లో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ పండ్ల జీఐ విలువ 36గా ఉంది. సాధారణంగా జీఐ విలువ 55 కన్నా ఎక్కువగా ఉంటే అలాంటి ఆహారాలు లేదా పండ్లను తినకూడదని వైద్యులు చెబుతారు. కానీ యాపిల్ పండ్ల జీఐ విలువ చాలా తక్కువ కనుక ఈ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఈ పండ్లలోని ఫైబర్ చర్మం, జీర్ణ వ్యవస్థను రక్షిస్తుంది.
పియర్స్, నారింజ పండ్లు..
షుగర్ ఉన్నవారు తినాల్సిన పండ్లలో పియర్స్ కూడా ఒకటి. వీటి జీఐ విలువ 38గా ఉంది. అందువల్ల ఈ పండ్లను కూడా ఎలాంటి జంకు లేకుండా తినవచ్చు. వీటిల్లో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయదు. పైగా షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అయితే ఈ పండ్లను చాలా మంది తొక్క తీసి తింటారు. కానీ తొక్కతో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. ఇక నారింజ పండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని డయబెటిస్ వ్యాధిగ్రస్తులు భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే ఈ పండ్ల జీఐ విలువ 40 మాత్రమే. కనుక వారు ఈ పండ్లను భయం లేకుండా తినవచ్చు. పైగా ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. అయితే నారింజ పండ్లను జ్యూస్‌లా చేసి తాగకూడదు. పండు రూపంలోనే తినాలి. అప్పుడే ఫైబర్ లభిస్తుంది. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
బెర్రీలు, చెర్రీలు, జామ పండ్లు..
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, బ్లాక్ బెర్రీల వంటి బెర్రీ పండ్ల జీఐ విలువ 25 నుంచి 40 మధ్యలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లను కూడా ఉత్తమమైనవిగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. షుగర్ లెవల్స్ తగ్గేందుకు సహాయం చేస్తాయి. కనుక ఈ పండ్లను తింటున్నా మేలు జరుగుతుంది. అలాగే చెర్రీ పండ్ల జీఐ విలువ 22 కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ పండ్లను కూడా నిర్భయంగా తినవచ్చు. ఈ పండ్లలో ఆంథోసయనిన్స్ అనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం ఇన్సులిన్‌ను మరింతగా శోషించుకునేలా చేస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే జామపండ్ల జీఐ విలువ (31) కూడా తక్కువగానే ఉంటుంది కనుక షుగర్ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేందుకు దోహదం చేస్తాయి. తరచూ జామ పండ్లను ఆహారంలో బాగం చేసుకుంటే మేలు కలుగుతుంది. ఇలా డయాబెటిస్ ఉన్నవారు ఆయా పండ్లను తింటూ ప్రయోజనాలను పొందవచ్చు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



