Meals | భోజనం చేసిన వెంటనే కూర్చుంటే ప్రమాదమే.. నిపుణుల హెచ్చరిక..
Meals | భోజనం చేసిన తరువాత సహజంగానే చాలా మందికి నిద్ర మత్తు వస్తుంది. ఎందుకంటే శరీరంలో రక్త సరఫరా మొత్తం జీర్ణవ్యవస్థ వైపు కేంద్రీకృతమవుతుంది. ఈ కారణంగా ఇతర అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో మెదడుకు నిద్రావస్థ సంకేతం వెళ్తుంది.
Meals | భోజనం చేసిన తరువాత సహజంగానే చాలా మందికి నిద్ర మత్తు వస్తుంది. ఎందుకంటే శరీరంలో రక్త సరఫరా మొత్తం జీర్ణవ్యవస్థ వైపు కేంద్రీకృతమవుతుంది. ఈ కారణంగా ఇతర అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో మెదడుకు నిద్రావస్థ సంకేతం వెళ్తుంది. దీని కారణంగా భోజనం చేసిన వెంటనే చాలా మందికి నిద్ర మత్తు వస్తుంది. దీంతో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన వెంటనే చాలా మంది నిద్రిస్తుంటారు. ఇక భోజనం చేశాక చాలా మంది కూర్చుని పనిచేస్తుంటారు కూడా. కానీ భోజనం చేసిన తరువాత నిజానికి ఈ రెండు అలవాట్లు అసలు మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్ల వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు, షుగర్ పెరుగుదల..
భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా నిద్రించడం చేస్తే దీర్ఘకాలంలో బరువు పెరగడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు సైతం పెరుగుతాయని న్యూజెర్సీకి చెందిన ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ అలేషియా రోనెల్ట్ చెప్పారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని వివరించారు. భోజనం చేసిన వెంటనే కూర్చోవడం, నిద్రించడం చేయకుండా కాసేపు వాకింగ్ చేయాలని ఆమె సూచించారు. దీని వల్ల అనేక లాభాలు ఉంటాయని తెలిపారు. భోజనం చేశాక కాసేపు వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. పేగుల్లో కదలికలు చురుగ్గా ఉంటాయి. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుందని అన్నారు.
వాకింగ్ ఉత్తమం..
భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని అలేషియా చెప్పారు. దీని వల్ల దీర్ఘకాలంలో డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు. ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి అయితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని అన్నారు. వాకింగ్ చేయడం వల్ల కండరాలకు పని లభిస్తుంది. దీంతో అవి రక్తంలో ఉన్న గ్లూకోజ్‌పై ఆధార పడతాయి. ఫలితంగా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి వాకింగ్ ఉత్తమ మెడిసిన్ అని తెలిపారు. అయితే భోజనం చేశాక వాకింగ్ చేయకుండా కూర్చోవడం లేదా నిద్రించడం చేస్తే శరీరం ఇన్సులిన్‌పై అధికంగా ఆధార పడాల్సి ఉంటుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నియంత్రణ కష్టంగా ఉంటుంది. దీంతో మరింత ఇబ్బంది కలుగుతుంది. కనుక భోజనం చేశాక కాసేపు వాకింగ్ ఒక్కటే దీనికి పరిష్కారం అని ఆమె తెలిపారు.
భోజనం చేశాక 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుందని ఆమె చెప్పారు. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌పై ఆధార పడడం తగ్గుతుంది. కండరాలు, కొవ్వు కణజాలం వినియోగించుకోబడతాయి. ఈ కారణంగా శరీరంలోని కొవ్వు నిల్వలు కరుగుతాయి. బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. కనుక భోజనం అనంతరం వాకింగ్ బెస్ట్ అని ఆమె సూచించారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



