Cleaning Grapes | ద్రాక్షలను కొని తెచ్చాక నేరుగా అలాగే తింటున్నారా..? అయితే జాగ్రత్త..!
Cleaning Grapes | తాజాగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ద్రాక్షపండ్లు మెరిసే తొక్కతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే ఆ మెరుపు వెనుక పురుగుమందుల అవశేషాలు, మైనపు పొర, ధూళి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష గుత్తులుగా పెరగడం, పలుచని తొక్క కలిగి ఉండడం వల్ల రసాయనాలు సులభంగా అంటుకుని ఉండిపోతాయి.
Cleaning Grapes | తాజాగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ద్రాక్షపండ్లు మెరిసే తొక్కతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే ఆ మెరుపు వెనుక పురుగుమందుల అవశేషాలు, మైనపు పొర, ధూళి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష గుత్తులుగా పెరగడం, పలుచని తొక్క కలిగి ఉండడం వల్ల రసాయనాలు సులభంగా అంటుకుని ఉండిపోతాయి. అందువల్ల కేవలం నీటితో కడగడం చాలాసార్లు సరిపోదు. వ్యవసాయంలో ద్రాక్షకు ఎక్కువసార్లు పురుగుమందులు పిచికారీ చేస్తుంటారు. పురుగులు, ఫంగస్ దాడులు ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. గుత్తులుగా దగ్గరగా ఉండే కాయల మధ్య చిన్న చిన్న భాగాల్లో రసాయనాలు చిక్కుకుపోతాయి. అందుకే పిల్లలకు లేదా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి ముందు ద్రాక్షలను సరిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.
రన్నింగ్ ట్యాప్ నీటితో..
శుభ్రపరిచే ప్రక్రియలో మొదట చల్లగా ఉండే రన్నింగ్ ట్యాప్ నీటితో ద్రాక్షలను 20 నుంచి 30 సెకన్ల పాటు కడగాలి. చేతులతో మృదువుగా రుద్దితే పైపొరలో ఉండే ధూళి, మట్టి తొలగిపోతాయి. ఇది ప్రాథమిక దశ మాత్రమే అయినప్పటికీ, ఉపరితల అవశేషాలను కొంతవరకు తగ్గిస్తుంది. ద్రాక్షలను మరింత శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి ద్రాక్షలను 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం బేకింగ్ సోడా పలు పురుగుమందుల అణువులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అనంతరం శుభ్రమైన నీటితో మళ్లీ బాగా కడగాలి.
వెనిగర్ ద్రావణంతో..
ఇంకొక సహజ పద్ధతి వెనిగర్ వాష్. ఒక భాగం వెనిగర్‌కు మూడు భాగాలు నీరు కలిపి ద్రాక్షలను 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇది బ్యాక్టీరియా, మోల్డ్ స్పోర్స్‌ను (శిలీంధ్రాలు) తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత పూర్తిగా కడిగితే వెనిగర్ వాసన ఉండదు. శుభ్రపరిచిన తర్వాత ద్రాక్షలను మృదువుగా తుడిచి ఆరబెట్టడం మంచిది. తడిగా ఫ్రిజ్‌లో ఉంచితే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. గాలి ఆడే పాత్రలో ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ద్రాక్షలు తాజాగా ఉంటాయి. అవసరమైనంత మాత్రమే ముందుగా కడగడం ఉత్తమం. ద్రాక్షలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, సరైన శుభ్రత లేకపోతే ఆరోగ్యపరమైన ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కేవలం 10 నుంచి 15 నిమిషాల జాగ్రత్తతో పురుగుమందుల అవశేషాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో చిన్న చిన్న జాగ్రత్తలను కూడా పాటించాలని, దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



