Pregnant Women | గర్భిణీలకు అలర్ట్.. థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఏఎస్‌డీ ప్రమాదం..
Pregnant Women | దేశంలో సుమారు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యలతో జీవిస్తున్నారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియన్ థైరాయిడ్ సొసైటీ పేర్కొంది. థైరాయిడ్, మెడ ముందు భాగంలో ఉండే ఒక గ్రంథి. ఇది ఎండోక్రైన్ సిస్టమ్ (అంతస్రావ వ్యవస్థ) లో ఒక భాగం, ఇది కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేయడం, విడుదల చేయడంతోపాటు శరీరంలోని అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది.
Pregnant Women | దేశంలో సుమారు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యలతో జీవిస్తున్నారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియన్ థైరాయిడ్ సొసైటీ పేర్కొంది. థైరాయిడ్, మెడ ముందు భాగంలో ఉండే ఒక గ్రంథి. ఇది ఎండోక్రైన్ సిస్టమ్ (అంతస్రావ వ్యవస్థ) లో ఒక భాగం, ఇది కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేయడం, విడుదల చేయడంతోపాటు శరీరంలోని అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి జీవక్రియను (మెటబాలిజం) నియంత్రిస్తుంది, ఇది చివరికి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు, అది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో కూడా థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముంబైలోని సైఫీ హాస్పిటల్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ షెహ్లా షేక్ మాట్లాడుతూ, బిడ్డ సరైన అభివృద్ధికి, ముఖ్యంగా నరాల సంబంధిత అభివృద్ధికి (న్యూరోలాజికల్ డెవలప్‌మెంట్) థైరాయిడ్ ఆరోగ్యం ఒక ముఖ్యమైన అంశమని తెలిపారు. గర్భధారణ సమయంలో అనియంత్రిత థైరాయిడ్ పనితీరు, ప్రత్యేకంగా హైపోథైరాయిడిజం వల్ల పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్‌డీ) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
మొదటి త్రైమాసికం కీలకం..
థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, మెదడు అభివృద్ధికి చాలా అవసరం. గర్భధారణ సమయంలో, ముఖ్యంగా బిడ్డ థైరాయిడ్ పూర్తిగా అభివృద్ధి చెందని మొదటి త్రైమాసికంలో (ఫస్ట్ ట్రైమిస్టర్) థైరాయిడ్ హార్మోన్లు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండి, ఎక్కువ కాలం పాటు సరిగ్గా నియంత్రణలో లేకపోతే, అది బిడ్డ నరాల సంబంధిత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, పిల్లలలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో సహా ప్రవర్తనా, అభివృద్ధి లోపాలకు, తల్లిలోని హైపోథైరాయిడిజానికి మధ్య సంబంధం ఉన్నట్లు అనేక అధ్యయనాలు గుర్తించాయి. పిండం మెదడు పరిపక్వత చెందే కీలక కాలంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు లేకపోవడం వల్ల మెదడు అభివృద్ధి, పనితీరుపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. హైపోథైరాయిడిజం కాలవ్యవధి, తీవ్రత చాలా ముఖ్యమైనవని నిపుణులు గమనించారు. గర్భధారణ సమయంలో చికిత్స చేయని హైపోథైరాయిడిజానికి ఎక్కువ కాలం గురికావడం వల్ల ఏఎస్‌డీ ముప్పు పెరుగుతుందని చెప్పారు. అందుకే గర్భధారణ కాలమంతటా ముందస్తు రోగనిర్ధారణ, తరచూ పర్యవేక్షణ, సకాలంలో చికిత్స అందించడం చాలా కీలకమని అంటున్నారు.
ఆందోళన చెందాల్సిన పనిలేదు..
అయితే ఈ విషయం పట్ల గర్భిణీలు ఆందోళన చెందే అవకాశం ఉందని, కానీ వారికి సర్దిచెప్పి ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధిక ప్రమాదం ప్రాథమికంగా చికిత్స చేయని లేదా సరిగ్గా నియంత్రణలో లేని హైపోథైరాయిడిజంతో మాత్రమే ముడిపడి ఉంటుంది. ముందుగానే వ్యాధి నిర్ధారణ జరిగి, సరైన చికిత్సతో తమ థైరాయిడ్ పరిస్థితిని అదుపులో ఉంచుకునే మహిళల్లో ఈ ప్రమాదం కనిపించదు. థైరాయిడ్ వ్యాధి పట్ల జాగ్రత్త వహించడం వల్ల సమస్యలను తగ్గించవచ్చు, ఆరోగ్యకరమైన గర్భధారణకు దోహదపడుతుంది. హైపోథైరాయిడిజం ఉన్న గర్భిణీలకు సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ ఇస్తారు. ఇందులో చాలా సాధారణంగా లెవోథైరాక్సిన్ ను సూచిస్తారు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ హార్మోన్ అవసరాలు త్రైమాసికం నుండి త్రైమాసికానికి మారుతాయి. కనుక థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్)ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. తల్లి, బిడ్డ అభివృద్ధి కోసం ప్రతి త్రైమాసికంలో టీఎస్‌హెచ్ స్థాయిలు కావలసిన పరిధిలో ఉండడం ముఖ్యం అని అంటున్నారు.
కొన్ని సార్లు కన్‌ఫ్యూజ్ అవొచ్చు..
కొన్నిసార్లు హైపోథైరాయిడిజం తేలికపాటి లక్షణాలు సాధారణ గర్భధారణ సమస్యలుగా గందరగోళం కలిగిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల అలసట, మలబద్ధకం (కాన్‌స్టిపేషన్), పొడి చర్మం, విపరీతమైన నిద్రమత్తు, జుట్టు రాలడం, చలిగా అనిపించడం వంటివి సంభవిస్తాయి. ఈ లక్షణాలు సాధారణ గర్భధారణ సమయంలో కనిపించే వాటిని పోలి ఉంటాయి. కనుక థైరాయిడ్ వ్యాధి చరిత్ర లేదా కుటుంబ చరిత్ర ఉన్న మహిళలకు క్రమబద్ధమైన స్క్రీనింగ్, ఫాలో-అప్ చాలా ముఖ్యం. థైరాయిడ్ సమస్యలు, క్రమరహిత పీరియడ్స్, సంతానోత్పత్తి సమస్యలు లేదా గతంలో గర్భధారణ సమస్యలు ఉన్న మహిళలు గర్భం ధరించడానికి ప్రయత్నించే ముందే తమ థైరాయిడ్ పనితీరును తనిఖీ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో సరైన థైరాయిడ్ సంరక్షణ తీసుకోవడం తల్లి, బిడ్డ ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
తల్లి ఆరోగ్యం ముఖ్యం..
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అభివృద్ధికి పర్యావరణ, జన్యుపరమైన ప్రభావాలు వంటి అనేక ఇతర అంశాలు కారణమైనప్పటికీ, తల్లి మంచి ఆరోగ్యం ఒక ముఖ్యమైన నివారణ చర్యగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో థైరాయిడ్ పనితీరు ప్రాముఖ్యత, ముందస్తు గుర్తింపు, థైరాయిడ్ చికిత్స గురించి మహిళలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ రుగ్మతలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో రోగనిర్ధారణ చేసి, థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పర్యవేక్షించి, నియంత్రణలో ఉంచినట్లయితే, చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణను పొందవచ్చని, దీంతో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- ●Maach Bhaat Scheme | కేవలం రూ.5 కే రుచికరమైన 'చేపల భోజనం'.. పేదల కోసం సీఎం బంపరాఫర్
- ●Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!
- ●Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు
- ●Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

Maach Bhaat Scheme | కేవలం రూ.5 కే రుచికరమైన 'చేపల భోజనం'.. పేదల కోసం సీఎం బంపరాఫర్

Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!

Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు

Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్



