WHO | ఎబోలా ఎఫెక్ట్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
WHO | ప్రాణాంతక వైరస్ ఎబోలా వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాంగో (Kango) , ఉగాండా (Uganda) దేశాల్లో 300 ఎబోలా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరించింది.
International | Published On May 17, 2026, 12.04 pm IST
WHO | త్రినేత్ర.న్యూస్: ప్రాణాంతక వైరస్ ఎబోలా వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాంగో (Kango) , ఉగాండా (Uganda) దేశాల్లో 300 ఎబోలా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రకటన విడుదల చేసింది. ఈ ఎబోలా వైరస్ (Ebola outbreak)తో 88 మంది మరణించినట్లు తెలిపింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ (Global Emergency)ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.
1976లో తొలిసారి గుర్తింపు..
ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వ సారి వ్యాప్తి చెందడమని అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. ప్రాథమిక నమూనాలలో అధిక పాజిటివిటీ రేటు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరంగా మారిందని వెల్లడించింది.
భయంతో సరిహద్దులు మూయొద్దు..
ఎబోలా వైరస్‌కు ప్రత్యేకంగా ఆమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్‌లు లేవని, దీన్ని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను క్రియాశీలం చేయాలని సూచించింది. సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని కోరింది. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని.. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచనలు చేసింది.
తాజావార్తలు
- ●Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్
- ●Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి
- ●YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
- ●Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- ●Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
- ●Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్

Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!

Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!






