లోడ్ అవుతోంది...


గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చడానికి వీలు కల్పించే బిల్లును రిపబ్లికన్ ఎంపీ రాండీ ఫైన్ ప్రవేశపెట్టారు. చైనా, రష్యాలు గ్రీన్లాండ్పై పట్టు సాధించకుండా అడ్డుకోవడం, అమెరికా రక్షణను బలోపేతం చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇది ట్రంప్ ప్రభుత్వపు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
US Greenland Annexation Bill | ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం, వ్యూహాత్మక ప్రాంతమైన గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసే ప్రక్రియ ఊపందుకుంది. డెన్మార్క్ ఆధీనంలోని ఈ స్వయంప్రతిపత్తి కలిగిన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని, అమెరికాలో ఒక రాష్ట్రంగా చేర్చుకోవడానికి వీలు కల్పించేలా 'గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్' (Greenland Annexation and Statehood Act) అనే కీలక బిల్లును రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రాండీ ఫైన్ అధికారికంగా ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు ద్వారా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన చట్టపరమైన అధికారం లభిస్తుంది. "గ్రీన్లాండ్ను అమెరికా యూనియన్లో చేర్చేందుకు అధ్యక్షుడు అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇది అమెరికా ఆధిపత్యాన్ని వచ్చే శతాబ్ద కాలం పాటు సుస్థిరం చేస్తుంది" అని రాండీ ఫైన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికా ప్రత్యర్థి దేశాలు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని, దీనిని తాము అనుమతించబోమని అగ్రరాజ్యం స్పష్టం చేస్తోంది.
చైనా, రష్యా లాంటి దేశాలు గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటే అది అమెరికా, ఐరోపా భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ అమెరికా ఈ చర్య తీసుకోకపోతే, శత్రు దేశాలు ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని తమ వశం చేసుకునే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఈ విలీనం కేవలం అమెరికాకే కాకుండా, గ్రీన్లాండ్ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని కరోలిన్ లెవిట్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి కాలపరిమితిని (Deadline) నిర్ణయించనప్పటికీ, జాతీయ భద్రత దృష్ట్యా ఇది తమ ప్రాధాన్యతలలో ఒకటని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల కొత్త షిప్పింగ్ మార్గాలు ఏర్పడుతుండటం, సహజ వనరుల లభ్యత పెరగడంతో గ్రీన్లాండ్ ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య పోటీకి ప్రధాన కేంద్రంగా మారింది.
Huge News! Today, I am proud to introduce the Greenland Annexation and Statehood Act, a bill that allows the President to find the means necessary to bring Greenland into the Union.
Let me be clear, our adversaries are trying to establish a foothold in the Arctic, and we can’t… pic.twitter.com/h28sXU7LAU
— Congressman Randy Fine (@RepFine) January 12, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam