Mine Collapse | కుప్పకూలిన గని.. 200 మందికి పైగా మృతి
Mine Collapse | ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) పెను విషాదం చోటుచేసుకున్నది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి (Mine Collapse) రుబయా కోల్టన్ గని కుప్పకూలింది. దీంతో 200 మందికిపైగా మరణించారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
International | Published On Mar 5, 2026, 8.04 am IST
Mine Collapse | త్రినేత్ర.న్యూస్: ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) పెను విషాదం చోటుచేసుకున్నది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి (Mine Collapse) రుబయా కోల్టన్ గని కుప్పకూలింది. దీంతో 200 మందికిపైగా మరణించారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ గని ఎం23 రెబల్ గ్రూప్ ఆధీనంలో ఉంది. అయితే, బాంబులతోనే ఈ ప్రమాదం జరిగిందని, కేవలం ఐదుగురు మాత్రమే చనిపోయినట్లు తిరుగుబాటుదారులు ప్రకటించింది.
నార్త్ కివూ ప్రావిన్స్ రాజధాని గొమాకు 70 కిలోమీటర్ల దూరంలో రుబయా కోల్టన్ గనులు ఉన్నాయి. ఈ ప్రాంతం 2024 నుంచి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నది. `మృతుల సంఖ్యపై జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధం. అక్కడ ఎలాంటి కొండ చరియలు విరిగిపడలేదు. బాంబులు పేలడంతో ఐదుగురు మాత్రమే మరణించారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు` అని రెబల్ గ్రూప్ సీనియర్ అధికారి ఫాన్నీ కాజ్ తెలిపారు.
కాగా, గనిలో పనిచేస్తున్న ఇబ్రహిం అనే వ్యక్తి మాత్రం 200కు పైగా మృతదేహాలను వెలికి తీశారని చెప్పారు. తమ ప్రణాలకు ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మైన్ నిర్వాహకులు మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు.
తాజావార్తలు
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
- ●Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..

Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?






