త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mojtaba Khamenei | సుప్రీం లీడ‌ర్ మొజ్తాబా బ‌తికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్‌

Mojtaba Khamenei | ఇరాన్‌ సుప్రీం లీడ‌ర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్యంపై గ‌త కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వార్త‌ల‌ను తిప్పికొడుతూ.. ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌కు సంబంధించిన ఓ వీడియోని ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఐబీ ( Islamic Republic of Iran Broadcasting) తాజాగా విడుద‌ల చేసింది.

D

International | Published On Mar 20, 2026, 11.58 am IST

Mojtaba Khamenei | సుప్రీం లీడ‌ర్ మొజ్తాబా బ‌తికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్‌
Advertisement

Mojtaba Khamenei | ఇరాన్‌ సుప్రీం లీడ‌ర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్యంపై గ‌త కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 28 ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, ఆయ‌న కోమాలో ఉన్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ వార్త‌ల‌ను తిప్పికొడుతూ.. ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌కు సంబంధించిన ఓ వీడియోని ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఐబీ ( Islamic Republic of Iran Broadcasting) తాజాగా విడుద‌ల చేసింది. ఆ వీడియోలో మొజ్తాబా కొంత‌మందికి మ‌త‌ప‌ర‌మైన బోధ‌న‌లు చేస్తూ క‌నిపించారు. యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఇలా బ‌హిరంగంగా క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి. అయితే, ఇది ఎప్ప‌టి వీడియో అన్న‌ది మాత్రం తెలియ‌రాలేదు.

https://x.com/iribnews_irib/status/2034767962612125707

కాగా, మొజ్తాబా ఖ‌మేనీ ప్ర‌స్తుతం కోమాలో (Mojtaba Khamenei in coma) ఉన్న‌ట్లు బ్రిటిష్ ప‌త్రిక ది స‌న్ ఇటీవ‌లే నివేదించిన విష‌యం తెలిసిందే. ఇజ్రాయెల్‌-యూఎస్ జ‌రిపిన సంయుక్త దాడిలో అతను తీవ్ర గాయాల‌పాలైన‌ట్లు తెలిపింది. ఈ దాడిలో మొజ్తాబా ఖ‌మేనీ ఓ కాలు కూడా కోల్పోయిన‌ట్లు స‌ద‌రు ప‌త్రిక నివేదించింది (Mojtaba Khamenei lost a leg). ప్ర‌స్తుతం టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు పేర్కొంది. అంతేకాదు, ఆయ‌న్ని ర‌హ‌స్యంగా ర‌ష్యాకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు కూడా అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. ఇక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మొజ్తాబా ఆరోగ్యంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. "నాకు తెలిసి మొజ్తాబా ఖమేనీ గాయ‌ప‌డ్డారు. ఆయ‌న ఏదో ఒక రూపంలో బ‌తికే ఉన్నాడ‌ని అనుకుంటున్నాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న ఆరోగ్యంపై గ‌త కొంత‌కాలంగా ప‌లు ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్నాయి. ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ.. ఇరాన్ అధికారిక మీడియా సుప్రీం లీడ‌ర్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేయ‌డం ఇప్పుడు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read..

ఫైర్ వార్నింగ్‌.. ముంబైకి రావాల్సిన విమానం సౌదీకి మ‌ళ్లింపు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు షాక్‌.. గాయంతో ఐపీఎల్‌కు సామ్ క‌ర్ర‌న్ దూరం..?

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 976 పాయింట్లు జంప్‌..!

Advertisement

తాజావార్తలు

Advertisement