త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nancy Grewal | కెన‌డాలో భార‌త సంత‌తి యూట్యూబ‌ర్ దారుణ హ‌త్య‌

Nancy Grewal | కెన‌డా (Canada)లో భార‌త సంత‌తికి చెందిన ఓ మ‌హిళా యూట్యూబ‌ర్ (Indian Origin YouTuber) దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను త‌న ఇంట్లోనే క‌త్తితో దాడి చేసి చంపేశారు.

D

International | Published On Mar 5, 2026, 4.31 pm IST

Nancy Grewal | కెన‌డాలో భార‌త సంత‌తి యూట్యూబ‌ర్ దారుణ హ‌త్య‌
Advertisement

Nancy Grewal | కెన‌డా (Canada)లో భార‌త సంత‌తికి చెందిన ఓ మ‌హిళా యూట్యూబ‌ర్ (Indian Origin YouTuber) దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను త‌న ఇంట్లోనే క‌త్తితో దాడి చేసి చంపేశారు. ఈ ఘ‌ట‌న ఒంటారియో (Ontario)లో మార్చి 3వ తేదీన రాత్రి జ‌రిగిన‌ట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతురాలిని పంజాబీ మూలాలున్న 45 ఏళ్ల నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal)గా గుర్తించారు.

ర‌క్త‌పు మ‌డుగుల్లో ప‌డి ఉన్న నాన్సీని గుర్తించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు నాన్సీని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గం మ‌ధ్య‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. నాన్సీ కెన‌డాలోని ఒంటారియోలో నివ‌సిస్తోంది. ఆమెకు సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా మంచి గుర్తింపు ఉంది.

నాన్సీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలపై తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఎంపీ అమృతపాల్ సింగ్‌, డేరా బియాస్‌కు చెందిన గురీందర్ సింగ్ ధిల్లాన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడారు. 2025 జూన్‌లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్‌ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి మరణంపై కూడా ఆమె గళమెత్తారు.

Also Read..

Iranian Ship | అమెరికా దాడుల వేళ శ్రీ‌లంక వైపు మ‌రో ఇరాన్ యుద్ధ నౌక‌.. దీన్ని కూడా పేల్చేస్తారా..?

Nitish Kumar | రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేసిన నితీశ్ కుమార్‌

Iran hits US tanker | గ‌ల్ఫ్‌లో అమెరికా ట్యాంక‌ర్‌పై ఇరాన్ దాడి

Advertisement
Advertisement