H1B Visa USA | గత పదేళ్లలో అమెరికాకు H1-B వీసాలపై ఎంత మంది వెళ్లారో తెలుసా? టాప్ ప్లేస్ మనదే..!
గత పదేళ్లలో అమెరికాకు వెళ్లిన H1-B వీసాదారుల సంఖ్య తెలిస్తే షాక్ అవుతారు. అందులో మన భారతీయులే ఎక్కువగా ఉన్నారు.
International | Published On May 24, 2026, 7.38 pm IST
H1B Visa USA | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే ఎంతో మందికి H1-B వీసా (H1-B Visa) ఒక వరం లాంటిది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు (IT Professionals) ఇది ఎంతో కీలకం. అయితే, గత పదేళ్లలో (2015-2025) అసలు ఎంతమంది H1-B వీసాలపై అమెరికా గడ్డపై అడుగుపెట్టారు? అందులో ఏ దేశస్తులు ఎక్కువగా ఉన్నారనే దానిపై ఆసక్తికరమైన గణాంకాలు (Statistics) బయటపడ్డాయి.
69 లక్షల మందికి పైగా
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేటా ప్రకారం, 2015 నుంచి 2025 వరకు అమెరికాకు వచ్చిన H1-B వీసాదారుల సంఖ్య ఏకంగా 69,32,647 కు చేరుకుంది. అమెరికా టెక్ రంగంపై వలసదారుల (Immigrants) ప్రభావం ఎంతలా ఉందో ఈ డేటాను చూస్తేనే స్పష్టంగా తెలుస్తోంది. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ లాంటి టెక్ హబ్స్ అంతా ఈ స్కిల్డ్ వర్కర్లతో నిండిపోయాయి.
సింహభాగం మన భారతీయులదే
ఈ లిస్ట్‌లో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. అత్యధిక శాతం మన భారతీయులదే! మొత్తం 69 లక్షల మందిలో ఏకంగా 50,59,211 మంది ఇండియన్సే ఉన్నారు. అంటే దాదాపు 70 శాతానికి పైగా H1-B వీసాలను మనవాళ్లే దక్కించుకున్నారు. మన టెకీలు అమెరికా టెక్ ఇండస్ట్రీకి ఎంతలా వెన్నెముకగా నిలుస్తున్నారో ఈ నంబర్స్ చెబుతున్నాయి.

భారత్ తర్వాత చైనా (7.8 లక్షలు) రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో కెనడా, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తుంటే, అమెరికా డెవలప్‌మెంట్‌లో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ (Silicon Valley) గ్రోత్‌లో మన భారతీయుల బ్రెయిన్ పవర్ ఎంత కీలకమో స్పష్టంగా అర్థమవుతోంది. భవిష్యత్తులో కూడా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
🚨 H1-B Visa workers to USA in the last 10 years. pic.twitter.com/hHES3tKkx6
— Indian Tech & Infra (@IndianTechGuide) May 23, 2026
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?



