త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

H-1B Visa Scam Exposed | టెక్సాస్‌లో భారీ హెచ్-1బి వీసా కుంభకోణం: నకిలీ కంపెనీల గుట్టురట్టు చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్

టెక్సాస్‌లో నివాస గృహాల అడ్రస్‌లతో సాఫ్ట్‌వేర్ కంపెనీల పేరిట హెచ్-1బి వీసాలు పొందుతున్న భారీ కుంభకోణాన్ని రిపోర్టర్ సారా గొంజాలెజ్ బయటపెట్టారు.

J

International | Published On Jan 23, 2026, 3.04 pm IST

H-1B Visa Scam Exposed | టెక్సాస్‌లో భారీ హెచ్-1బి వీసా కుంభకోణం: నకిలీ కంపెనీల గుట్టురట్టు చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్

సంక్షిప్త సారాంశం

అమెరికాలోని టెక్సాస్‌లో హెచ్-1బి వీసాల దుర్వినియోగం కలకలం రేపుతోంది. నకిలీ చిరునామాలు, వర్చువల్ ఆఫీసులను చూపిస్తూ భారతీయులతో సహా పలువురు విదేశీయులను అక్రమంగా అమెరికాకు రప్పిస్తున్న తీరును ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ బహిర్గతం చేసింది. నివాస గృహాల నుంచి కంపెనీలు నడుపుతున్నట్లు రికార్డులు సృష్టించి వీసాలు పొందుతున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

H-1B Visa Scam Exposed | త్రినేత్ర.న్యూస్: అమెరికాలో భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్-1బి (H-1B) వీసాల విషయంలో ఒక భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్, ప్లానో నగరాల్లో నివాస గృహాలను, వర్చువల్ ఆఫీసులను అడ్రస్‌లుగా చూపిస్తూ వందలాది హెచ్-1బి వీసాలను పొందుతున్న వైనాన్ని యూఎస్ రిపోర్టర్ సారా గొంజాలెజ్ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా బహిర్గతం చేశారు.

నివాస గృహాలే టెక్ కంపెనీలా?

సారా తన పరిశోధనలో భాగంగా '3Bs Technologies' అనే కంపెనీని సందర్శించారు. రికార్డుల ప్రకారం ఈ కంపెనీకి 2022-2025 మధ్య 27 హెచ్-1బి వీసాలు మంజూరయ్యాయి. అయితే, ఆ అడ్రస్ వద్దకు వెళ్లి చూడగా అది ఒక సాధారణ నివాస గృహం. అక్కడ ఎటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లేరు. ఆఫీసు లేదు. ఓ కుటుంబం అక్కడ నివసిస్తోంది. పొరుగువారు కూడా అక్కడ ఎప్పుడూ ఉద్యోగుల సందడి చూడలేదని తెలిపారు.

వర్చువల్ ఆఫీసుల మాయాజాలం

మరో కంపెనీ 'Quibbitz Tech Systems' పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 12 మంది వీసా ఉద్యోగులు ఉండాల్సిన ఆఫీసులో కేవలం రెండు మడత బల్లలు (foldout tables), ఒక కుర్చీ మాత్రమే ఉన్నాయి. రిపోర్టర్ అక్కడికి వెళ్లినప్పుడు ఆ కంపెనీ యజమాని ఆమెను బెదిరిస్తూ పోలీసులకు ఫోన్ చేయడం గమనార్హం.

వెబ్‌సైట్లలో తప్పులు.. అడ్రస్‌లు గల్లంతు

కుంభకోణానికి పాల్పడుతున్న ఈ కంపెనీల వెబ్‌సైట్లలో ఉన్న ఫోన్ నంబర్లు పని చేయకపోవడం సారా గుర్తించారు. 'Criti Infosystems' వంటి కంపెనీలు ఇండియాలో లేని అడ్రస్‌లను తమ వెబ్‌సైట్లలో పేర్కొన్నాయి. చాలా వరకు వీసాలను స్పాన్సర్ చేస్తున్న వ్యక్తులు భారతీయులే కావడం గమనార్హం.

యూఎస్‌సీఐఎస్ (USCIS) నిఘా ఎక్కడ?

కేవలం గూగుల్ సెర్చ్ ద్వారా బయటపడే ఇలాంటి చిన్న విషయాలను కూడా అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం (USCIS) ఎందుకు గుర్తించడం లేదని సారా ప్రశ్నించారు. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతూ, సిస్టమ్‌ను మోసం చేస్తున్న ఇలాంటి నకిలీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

https://x.com/theblaze/status/2014439729396170927

Advertisement
Advertisement