త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Military Plane Crash | కొలంబియాలో కూలిన విమానం.. 66 మంది సైనికులు మృతి

Military Plane Crash | కొలంబియా (Colombia)లో ఘోర విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. సైనిక విమానం (Military Plane Crash) టేకాఫ్ అయిన కాసేప‌టికే ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 60 మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

D

International | Published On Mar 24, 2026, 10.26 am IST

Military Plane Crash | కొలంబియాలో కూలిన విమానం.. 66 మంది సైనికులు మృతి
Advertisement

Military Plane Crash | కొలంబియా (Colombia)లో ఘోర విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. సైనిక విమానం (Military Plane Crash) టేకాఫ్ అయిన కాసేప‌టికే ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 60 మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 114 మంది సైనికులు, 11 మంది సిబ్బందితో కొలంబియా వైమానిక ద‌ళానికి చెందిన విమానం సోమ‌వారం ఉద‌యం పెరూ స‌రిహ‌ద్దుల్లోని ప్యూర్టో లెగీజామో (Puerto Leguízamo) విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ అయ్యింది.

అయితే, టేకాఫ్ అయిన కాసేప‌టికే ప్యూర్టో ప‌ట్ట‌ణ స‌మీపంలో ఒక్క‌సారిగా కూలిపోయింది. విమానం కూలిన వెంట‌నే అక్క‌డ పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 66 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ప్ర‌మాద స‌మాచారం అందిన వెంట‌నే రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రాణాల‌తో ఉన్న వారి కోసం శిథిలాల కింద గాలింపు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఇక ప్ర‌మాద తీవ్ర‌త‌ను బ‌ట్టి అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు. ప్ర‌మాదానికి గురైన సీ-130 హెర్క్యులస్ (US-made C-130 Hercules) విమానం అమెరికాలో త‌యారైంది. దీన్ని కొలంబియా సైనిక ద‌ళం సైనికుల‌ను త‌ర‌లించేందుకు వినియోగిస్తోంది.

Also Read..

రూ.2.90 ల‌క్ష‌ల గ్రాఫిక్ కార్డును ఆర్డ‌ర్ చేస్తే.. కిలోన్న‌ర డిట‌ర్జెంట్ పౌడ‌ర్ వ‌చ్చింది..

శ్రీరామ‌న‌వ‌మి శోభాయాత్ర‌.. 3000 మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త‌.. డ్రోన్ల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ‌

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం రాయితీ.. మార్చి 31 వరకే ఛాన్స్!

Advertisement

తాజావార్తలు

Advertisement