Bathukamma | అబుదాబిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
Bathukamma | తెలంగాణ పల్లెలు అన్నీ అబుదాబికి కదలి వచ్చినయా అన్నట్టుగా అనుభూతి కలిగేలా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అబుదాబి వారు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
International | Published On Oct 17, 2026, 2.50 pm IST
Bathukamma | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ పల్లెలు అన్నీ అబుదాబికి కదలి వచ్చినయా అన్నట్టుగా అనుభూతి కలిగేలా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అబుదాబి వారు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అబుదాబి వేదికగా జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కౌన్సిలర్ ఆఫ్ ఎంబసీ ఇండియా సౌమ్య గుప్తా, గౌరవ అతిథిగా డాక్టర్ బాలాజీ రామస్వామి కౌన్సిలర్ ఆఫ్ ఇండియా ఎంబసీ , ప్రత్యేక అతిథిగా దాస్యం అభినవ్, బీజేపీ ఎన్నారై కన్వీనర్ తెలంగాణ, ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు బీజీ థామస్, వివిధ రాష్ట్రాల వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని బతుకమ్మ వేడుకలు ఆసాంతం తిలకించి పులకించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళలు బతుకమ్మలను తయారు చేసి తీసుకువచ్చారు.

సంప్రదాయ నృత్యాలతో 4 గంటల పాటు కొనసాగిన ఈ ఉత్సవాలలో మహిళలు, యువతులు, చిన్నారులు ప్రత్యేక నృత్యాలు ప్రదర్శించారు. ఇండియా నుండి వచ్చిన ప్రముఖ కళాకారుడు డాక్టర్ కోకిల నాగరాజు నృత్య దర్శకత్వంలో రూపొందించిన ఈ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇండియా నుండి వచ్చిన గాయకులు , డాన్సర్లు అంజలి పులింటి, సోనీ యాదర్ల, సోనీ పటేల్లు తమ ఆటపాటలతో అలరించారు. అబుదాబిలో నివసించే కవీష్, సంజన, అభిరామ్లు చక్కటి బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు.

రాము గౌడ్ కుటుంబ సభ్యులు రూపొందించిన 12 అడుగుల బతుకమ్మ కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలు తయారుచేసి తీసుకొచ్చిన మహిళలకు, సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు నిర్వాహకులు అందించారు. " మన తెలంగాణ సంప్రదాయాన్ని, సంస్కృతిని పరిరక్షించడం కోసమే గత పది సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవం, వివిధ పండుగలకు అందరినీ ఏకం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టీఎఫ్ఏ అధికార ప్రతినిధి రాజా శ్రీనివాస రావు అన్నారు.

ఈ కార్యక్రమం కోసం శ్రమించిన మహిళ ప్రతినిధులు పావని, అర్చన, పద్మజ, నిధి, వాహిని, ప్రణతి, మిగతా మహిళ ప్రతినిధులను సౌమ్య గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. వేల సంఖ్యలో ప్రజలు హాజరైన ఈ సంబరాలలో యూఏఈ దేశ మహిళలు సైతం పాల్గొని ఆడి పాడడం విశేషంగా ఆకట్టుకుంది. అందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ఏ ప్రతినిధులు శ్రీనివాస్, గంగారెడ్డి, వంశీ, అశోక్, జగదీశ్, గోపినాథ్, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

తాజావార్తలు
- ●Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు
- ●Starlink | భారత్లో హైస్పీడ్ ఇంటర్నెట్కు స్టార్లింక్ సిద్ధం.. రిలయన్స్ కామెంట్లకు మస్క్ రియాక్షన్..
- ●Keerthy Suresh | బర్త్డే రోజు డబుల్ ట్రీట్ ఇచ్చిన కీర్తి సురేష్ - ఒకటి క్లాస్ - మరోటి మాస్
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పద్మాక్షి గుట్టలో మొక్కలు నాటిన ప్రముఖులు
- ●ChatGPT | చాట్ జీపీటీలో కొత్త ఫీచర్.. ఫామ్లను అలవోకగా నింపుతుంది..
- ●UN | యువశక్తి దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలా..? ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం

Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు

Starlink | భారత్లో హైస్పీడ్ ఇంటర్నెట్కు స్టార్లింక్ సిద్ధం.. రిలయన్స్ కామెంట్లకు మస్క్ రియాక్షన్..

Keerthy Suresh | బర్త్డే రోజు డబుల్ ట్రీట్ ఇచ్చిన కీర్తి సురేష్ - ఒకటి క్లాస్ - మరోటి మాస్

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పద్మాక్షి గుట్టలో మొక్కలు నాటిన ప్రముఖులు






