త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నాడు సిగాచి.. నేడు సరాక.. కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: హ‌రీశ్ రావు

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న‌ద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. గ‌త చేదు అనుభ‌వాల నుంచి ఈ ప్ర‌భుత్వం ఏం నేర్చుకోదా? అని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Oct 23, 2026, 11.12 am IST

Harish Rao | నాడు సిగాచి.. నేడు సరాక.. కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న‌ద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. గ‌త చేదు అనుభ‌వాల నుంచి ఈ ప్ర‌భుత్వం ఏం నేర్చుకోదా? అని మండిప‌డ్డారు. ప‌రిశ్ర‌మ‌ల్లో త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర్మార్గ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం (Gaddapotharam) పారిశ్రామిక వాడలోని సరాక రసాయన పరిశ్రమలో(Saraca Laboratories)  గ్యాస్ లీక్ అయి ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారే. నాడు సిగాచి, నేడు స‌రాక అంటూ ఎక్స్ వేదిక‌గా మండిప‌డ్డారు.

`పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్రమాదం. గత చేదు అనుభవాల నుండి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా?. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటోంది.

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ప్రశ్నార్థకంగా మారగా, అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప.. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు మీరు చేస్తున్నదేమిటి?. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడు?. సరాక పరిశ్రమ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి. ఉపాధి కోసం వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. సిగాచి ఘటనలో ఇంటి పెద్దను కోల్పోయిన 54 మంది కార్మిక కుటుంబాలందరికీ సీఎం స్వయంగా ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలి.` అని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement