త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Feel The Jail | చంచల్‌గూడ జైలు మ్యూజియం సందర్శించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం

Feel The Jail | హైదరాబాద్‌లోని చంచ‌ల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియం, అలాగే ఫీల్ ద జైలు కేంద్రాన్ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ బృందం బుధ‌వారం సంద‌ర్శించింది.

P

Hyderabad | Published On May 20, 2026, 7.18 pm IST

Feel The Jail | చంచల్‌గూడ జైలు మ్యూజియం సందర్శించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం
Advertisement

Feel The Jail | హైదరాబాద్‌లోని చంచ‌ల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియం, అలాగే ఫీల్ ద జైలు కేంద్రాన్ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ బృందం బుధ‌వారం సంద‌ర్శించింది. ఈ సందర్భంగా జైలు చరిత్ర, అక్కడి జీవన విధానం, శిక్షల అమలు తీరుపై అధికారులు అందించిన వివరణను బృంద సభ్యులు ఆసక్తిగా పరిశీలించారు. బ్రిటిష్ కాలం, నిజాం కాలం నాటి జైలు నమూనాలు, అప్పటి శిక్షా విధానాలను ఎంతో స్పష్టంగా, సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శించారని రాజేంద్ర ప‌ల‌నాటి తెలిపారు.

జైలు జీవితం ఎలా ఉంటుంది.. ఖైదీల రోజువారీ జీవనం, వారి ప్రవర్తన, పనితీరు, శిక్షలు, ఆహారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కలిగించేలా ఈ ప్రదర్శన ఉంద‌ని పేర్కొన్నారు. ‘ఒక రోజు జైలు జీవితం’ అనే కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి అనుభవాత్మక కార్యక్రమాల ద్వారా తప్పు చేయాలనే ఆలోచనే తగ్గిపోతుందని పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్ కూడా యువత, విద్యార్థులకు ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవేంద‌ర్‌, జీ హరిప్రకాశ్, బత్తిని రాజేశ్, కొమటి రమేశ్ బాబు, సాయి కిరణ్, విక్రమ్, రాజామ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement