Hyderabad | జ్యూస్ అని చెప్పి నాలుగేండ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని.. బోడుప్పల్‌లో అమానవీయ ఘటన
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) బోడుప్పల్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో తన కొడుకును చిన్నచూపు చూస్తున్నారని తోడికోడలి కుమారుడిపై ఓ మహిళ దారుణానికి పాల్పడింది. నాలుగేండ్ల బాలుడికి యాసిడ్ (Acid) తాగించింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) బోడుప్పల్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో తన కొడుకును చిన్నచూపు చూస్తున్నారని తోడికోడలి కుమారుడిపై ఓ మహిళ దారుణానికి పాల్పడింది. నాలుగేండ్ల బాలుడికి యాసిడ్ (Acid) తాగించింది.
బోడుప్పల్ (Boduppal) శ్రీనివాస కాలనీలో ఉండే పర్వతం సతీశ్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీష్ ఉన్నారు. వారిద్దరికి వివాహాలు అయ్యి, పిల్లలు ఉన్నారు. ఉమ్మడి కుటుంబం కావడంతో అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెద్ద కుమారుడు నాగరాజు, సంధ్యల కుమారుడు కార్తీక్ (4 ఏండ్లు) అంటే తాత సతీశ్ ప్రేమ చూపించేవాడు. అతని చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. దీంతో మామ కార్తీక్‌పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని, తన బిడ్డను పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల కక్ష పెంచుకున్నది. ఎలాగైనా ఆ బాలుడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది.
ఇందులో భంగా ఈ నెల 9న మంజుల.. కార్తీక్‌ను వంటగదిలోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి, యాసిడ్ తాగించింది. గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ దవాఖానకు తరలించారు. బుధవారం రాత్రి బాలుడి తల్లి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ తన కుమారుడి నోరు, ముక్కు మూసి చేతులు పట్టుకుందని, తాను గమనించి, ప్రశ్నించడంతో ఆడుకుంటున్నామని చెప్పి తప్పించుకుందని అందులో పేర్కొంది. మరోసారి అతడిని ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లి రెయిలింగ్‌పై కూర్చోబెట్టిందని తెలిపింది. ఇలా తన కుమారుడిని చంపాలని పలుమార్లు ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




