త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Banjarahills | బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

Banjarahills | బంజారాహిల్స్‌లో సోమ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన వాట‌ర్ ట్యాంక‌ర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెందారు.

S

Hyderabad | Published On Feb 23, 2026, 3.00 pm IST

Banjarahills | బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి
Advertisement

Banjarahills | త్రినేత్ర‌.న్యూస్ : బంజారాహిల్స్‌లో సోమ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన వాట‌ర్ ట్యాంక‌ర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సంతోష్ న‌గ‌ర్ ట్రాఫిక్ పోలీసు స్టేష‌న్‌లో హోంగార్డుగా విధులు నిర్వ‌ర్తిస్తున్న స‌య్య‌ద్ హుస్సేన్.. ఖాళీ స‌మ‌యంలో ర్యాపిడో బైక్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే సోమ‌వారం ఉద‌యం అక్షిత అనే యువ‌తి ర్యాపిడో ద్వారా రైడ్ బుక్ చేసుకుని, స‌య్య‌ద్ హుస్సేన్ బైక్‌పై బ‌య‌ల్దేరారు. బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ 10లో వేగంగా దూసుకొచ్చిన వాట‌ర్ ట్యాంక‌ర్ వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. అక్షిత‌ది విజ‌య‌న‌గ‌రం జిల్లా అని పోలీసులు తేల్చారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement