త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారి మూసివేత.. ఘ‌ట్‌కేస‌ర్ వ‌ద్ద‌ వాహ‌నాల మ‌ళ్లింపు..

Traffic Restrictions | వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ముఖ్య సూచ‌న‌. పీర్జాదిగూడ క‌మాన్ వ‌ద్ద పిల్ల‌ర్ ఫౌండేష‌న్ నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నందున ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తున్నారు.

S

Hyderabad | Published On Feb 7, 2026, 8.18 am IST

Traffic Restrictions | వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారి మూసివేత.. ఘ‌ట్‌కేస‌ర్ వ‌ద్ద‌ వాహ‌నాల మ‌ళ్లింపు..
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ముఖ్య సూచ‌న‌. పీర్జాదిగూడ క‌మాన్ వ‌ద్ద పిల్ల‌ర్ ఫౌండేష‌న్ నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నందున ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తున్నారు. ఈ క్ర‌మంలో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఘ‌ట్‌కేస‌ర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

వ‌రంగ‌ల్ నుంచి ఉప్ప‌ల్ వైపు వెళ్లే వాహ‌న‌దారుల‌ను ఘ‌ట్‌కేస‌ర్ వ‌ద్ద‌నే మ‌ళ్లిస్తున్నారు. డెక‌త్లాన్ వ‌ద్ద ఎడ‌మ వైపున‌కు వెళ్లి.. అక్క‌డ్నుంచి సేక్రేడ్ హార్ట్ స్కూల్ ముందు నుంచి పీర్జాదిగూడ మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి. అక్క‌డ కుడివైపున‌కు మ‌ళ్లి ఉప్ప‌ల్ వైపు చేరుకోవాల‌ని వాహ‌న‌దారుల‌కు పోలీసులు సూచించారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement
Advertisement