త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | గ‌చ్చిబౌలి – లింగంప‌ల్లి వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్.. ఏడాది పాటు ట్రాఫిక్ మ‌ళ్లింపు

Traffic Restrictions | గచ్చిబౌలి- లింగంపల్లి మార్గంలో వెళ్లే వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు అప్ర‌మ‌త్తం చేవారు. గ‌చ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ వ‌ద్ద మ‌ల్టీ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్, అండ‌ర్ పాస్ ప‌నుల నేప‌థ్యంలో ఏడాది పాటు ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

S

Hyderabad | Published On Apr 8, 2026, 4.56 pm IST

Traffic Restrictions | గ‌చ్చిబౌలి – లింగంప‌ల్లి వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్.. ఏడాది పాటు ట్రాఫిక్ మ‌ళ్లింపు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : గచ్చిబౌలి- లింగంపల్లి మార్గంలో వెళ్లే వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు అప్ర‌మ‌త్తం చేవారు. గ‌చ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ వ‌ద్ద మ‌ల్టీ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్, అండ‌ర్ పాస్ ప‌నుల నేప‌థ్యంలో ఏడాది పాటు ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. ఉద‌యం 8 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు గ‌చ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను మ‌ళ్లించ‌నున్నారు. ఈ ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఏప్రిల్ 8వ తేదీ నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంపిక చేసుకోవాల‌ని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

గ‌చ్చిబౌలి జంక్ష‌న్ నుంచి ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ మీదుగా గ‌చ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ గేట్ నంబ‌ర్ 2 నుంచి లింగంప‌ల్లి వెళ్లే వాహ‌నాల‌ను ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించి విప్రో జంక్ష‌న్ మీదుగా వెళ్లేందుకు అనుమ‌తించ‌నున్నారు. గౌలిదొడ్డి, గోప‌న్‌ప‌ల్లి జంక్ష‌న్, న‌ల్ల‌గండ్ల మీదుగా లింగంప‌ల్లి చేరుకోవ‌చ్చు.

ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్, గోప‌న్‌ప‌ల్లి తండా, గౌలిదొడ్డి, క్యూ సిటీ, విప్రో జంక్ష‌న్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించి విప్రో జంక్ష‌న్ నుంచి నాన‌క్‌రాంగూడ రోట‌రీ 2 నుంచి లెఫ్ట్ ట‌ర్న్ తీసుకోని ఓఆర్ఆర్ వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డ్నుంచి గ‌చ్చిబౌలి జంక్ష‌న్‌కు చేరుకోవ‌చ్చు.

లింగంప‌ల్లి నుంచి హెచ్‌సీయూ, మ‌జీద్‌బండ టీ జంక్ష‌న్, గ‌చ్చిబౌలి స్టేడియం, డీఎల్ఎఫ్ జంక్ష‌న్ మీదుగా గ‌చ్చిబౌలి, కొత్త‌గూడ‌, మెహిదీప‌ట్నం వెళ్లే వాహ‌నాల‌ను ఎస్ఎంఆర్ లేదా హెచ్‌సీయూ బ‌స్ డిపో జంక్ష‌న్ నుంచి మ‌జీద్‌బండ‌కు మ‌ళ్లించ‌నున్నారు. శ్రీరాంన‌గ‌ర్, బొటానిక‌ల్ జంక్ష‌న్, ఆ త‌ర్వాత రైట్ ట‌ర్న్ తీసుకొని ఉడుపి హోట‌ల్, మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకుని జ‌డ్‌పీహెచ్ఎస్ గ‌చ్చిబౌలి మీదుగా గ‌చ్చిబౌలి జంక్ష‌న్ చేరుకోవ‌చ్చు.

Advertisement
Advertisement