Traffic Advisory | ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు.. ఈ మార్గాల్లో వెళ్లారో ఇక అంతే!
Traffic Advisory | ఛత్రపతి శివాజీ జన్మదిన (Chhatrapati Shivaji Jayanti) వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Advisory) విధించారు. ఓల్డ్‌సిటీలోని పురాణాపూల్ దర్వాజ నుంచి శోభాయాత్ర యాత్ర ప్రారంభం కానున్నది.
Traffic Advisory | త్రినేత్ర.న్యూస్: ఛత్రపతి శివాజీ జన్మదిన (Chhatrapati Shivaji Jayanti) వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Advisory) విధించారు. ఓల్డ్‌సిటీలోని పురాణాపూల్ దర్వాజ నుంచి శోభాయాత్ర యాత్ర ప్రారంభం కానున్నది. ఇబ్లీబన్ బస్టాండ్ వద్ద నున్న శివాజీ విగ్రహం వరకు యాత్ర సాగుతుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పదీనా, ఎస్‌జే రోడ్డు, అఫ్జల్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారిమళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- శంషాబాద్, అత్తాపూర్ నుంచి పురాణాపూల్ దర్వాజకు వచ్చే ఆర్టీసీ బస్సులను ఆరాంఘర్ మీదుగా చాదర్‌ఘాట్‌కు మళ్లిస్తారు.
- ఆరాంఘర్ నుంచి పురాణాపూల్ వెళ్లే వాహనాలను బహదూర్‌పురా ఎక్స్ రోడ్ మీదుగా కిషన్ బాఘ్, కామాటిపురకు మళ్లిస్తారు.
- మదీనా నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే వాహనాలను గుడ్‌విల్ కేఫ్ వద్ద పత్రివాడా, బహదూర్‌పురా ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.
- సిటీకాలేజీ నుంచి పురాణాపూల్ దర్వాజ వెళ్లే వాహనాలను ఎంజే బ్రిడ్జి వైపు
100 ఫీట్ల రోడ్డు మీదుగా జియాగూడ, కార్వాన్ పైపు నుంచి వచ్చే వాహనాలను పురాణాపూరల్ ఎక్స్ రోడ్ మీదుగా జుమ్మేరాత్ బజార్, ఎంజే బ్రిడ్జి వైపు - శివాజీ జెంక్షన్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను పాత ఆర్టీసీ డిపో మీదుగా రంగమహల్ వైపు మళ్లిస్తారు.
అఫ్జల్‌గంజ్, సెంట్రల్ లైబ్రరీ నుంచి శివాజీ జంక్షన్ వచ్చే వాహనాలను అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్ వద్ద ఎస్ే బజార్ మసీద్‌వైపు దారి మళ్లిస్తారు. - ఎంజే మార్కెట్ నుంచి అఫ్జల్‌గంజ్ వచ్చే వాహనాలను మాలకుంట, అలస్కా, ఛత్రి, ఎంజే బ్రిడ్జి వైపు
అఫ్జగంజ్ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాలను అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ వైపు దారి మళ్లిస్తారు.
మరోవైపు గురువారం సాయంత్రం మోతీనగర్‌లోని హనుమాన్ ఆలయం నుంచి బోరబండ బస్టాండ్ వరకు శిబాజీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు బోరబండ బస్టాండ్, మోతీనగర్ ఎక్స్‌రోడ్స్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, ఎమర్జెన్సీ సమయంలో సహాయం కోసం 90102 03626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




