త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | బాలిక‌కు గంజాయి తాగించి.. ముగ్గురు రౌడీషీట‌ర్ల లైంగిక‌దాడి

Hyderabad | హైదరాబాద్‌లోని (Hyderabad) నార్సింగి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో దారుణం చోటుచేసుకున్న‌ది. మైన‌ర్ బాలిక‌కు గంజాయి తాగించిన రౌడీషీట‌ర్లు సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు.

G

Hyderabad | Published On Feb 19, 2026, 12.14 pm IST

Hyderabad | బాలిక‌కు గంజాయి తాగించి.. ముగ్గురు రౌడీషీట‌ర్ల లైంగిక‌దాడి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లోని (Hyderabad) నార్సింగి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో దారుణం చోటుచేసుకున్న‌ది. మైన‌ర్ బాలిక‌కు గంజాయి తాగించిన రౌడీషీట‌ర్లు సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. బాలిక మ‌త్తులో ఉండ‌గా ముగ్గురు రౌడీషీట‌ర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలికి ద‌వాఖాన‌లో చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. నిందితులు ముగ్గురూ ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు.

కాగా, బాధితురాలు నెక్నాంపూర్ డివిజ‌న్ పాషా కాల‌నీకి చెందిన బాలిక‌గా గుర్తించారు. ఆమె నార్సింగిలోని త‌న నాన‌మ్మ‌తో క‌లిసి నివ‌సిస్తున్న‌ద‌ని, ఈ నేప‌థ్యంలో నార్సింగ్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు న‌మోద‌యిన‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement