త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chutneys | ఎల్‌బీ న‌గ‌ర్ చ‌ట్నీస్ హోట‌ల్‌లో పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Chutneys | న‌గ‌రంలోని ఎల్‌బీ న‌గ‌ర్ చ‌ట్నీస్ హోట‌ల్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి.

S

Hyderabad | Published On Feb 20, 2026, 3.54 pm IST

Chutneys | ఎల్‌బీ న‌గ‌ర్ చ‌ట్నీస్ హోట‌ల్‌లో పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Advertisement

Chutneys | త్రినేత్ర‌.న్యూస్ : న‌గ‌రంలోని ఎల్‌బీ న‌గ‌ర్ చ‌ట్నీస్ హోట‌ల్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే ఇడ్లీ స్టీమ‌ర్‌లో పేలుడు సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. పేలుడుకు గ‌ల కచ్చిత కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న ఎల్‌బీ న‌గ‌ర్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పేలుడు ధాటికి వినియోగ‌దారులు భ‌యంతో ప‌రుగులు తీశారు.

Advertisement
Advertisement