Hyderabad | సొంతింట్లో బంగారు దొంగతనం.. కుమారుడితో సహా ముగ్గురు అరెస్ట్
Hyderabad | జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు సొంతింట్లోనే బంగారం దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ కేసులో కుమారుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురి నుంచి 13.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు సొంతింట్లోనే బంగారం దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ కేసులో కుమారుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురి నుంచి 13.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్(56) తన భార్యాపిల్లలతో స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే మార్చి 29వ తేదీన బీరువాను చూడగా, అందులో ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో షరీఫ్ కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
షరీఫ్ కుమారుడు మహ్మద్ అద్నాన్ షరీఫ్(19) ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఏడాది జనవరి 17 నుంచి మార్చి 29 వరకు బంగారు ఆభరణాలను విడతల వారీగా దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. ఈ బంగారాన్ని తన స్నేహితులైన మరో ఇద్దరికి అప్పగించి విక్రయించాలని కోరానని పేర్కొన్నాడు.
ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అద్నాన్ షరీఫ్‌తో పాటు స్నేహితులు మహ్మద్ రెహాన్ ఉద్దీన్(25), మహ్మద్ సమీర్(22)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురి నుంచి 13.7 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక వెర్నా కారును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి జ్యుడిషీయల్ రిమాండ్‌కు తరలించారు.

తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




