Hyderabad | వడ్డీ వ్యాపారుల వేధింపులు.. అంబర్‌పేటలో ముగ్గురు మృతి
Hyderabad | వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌లో చోటు చేసుకుంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌లో చోటు చేసుకుంది. మృతులను రామరాజు(55), ఆయన భార్య మాధవి(50), కుమారుడు శశాంక్(24)గా పోలీసులు గుర్తించారు.
అంబర్‌పేట్‌లో నివాసముంటున్న రామరాజు.. ల్యాండ్ మార్క్ హోటల్ నిర్వహిస్తున్నాడు. అయితే హోటల్ వ్యాపారంలో భారీగా నష్టాలు చవిచూశాడు. అప్పులు కూడా ఎక్కువయ్యాయి. చివరకు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక రామరాజు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.
హత్య.. ఆపై ఆత్మహత్య
- మొదట మాధవిని చంపాలని రామరాజు నిర్ణయించుకున్నాడు. దీంతో కుమారుడి సహకారంతో ఆమెపై దిందు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం తండ్రీకుమారుడు సూసైడ్ చేసుకున్నారు. రామరాజు ఉరేసుకోగా, శశాంక్ మణికట్టు కట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
వెలుగులోకి ఇలా..
- మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనకు ముందు.. రామరాజు తన స్నేహితుడు రవికి మొబైల్‌లో సందేశం పంపాడు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని తెల్లవారుజామున 3.15 గంటలకు మేసేజ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన రవి.. రామరాజు నివాసానికి వచ్చి చూడగా ముగ్గురు చనిపోయి ఉన్నారు. వెంటనే 100కి కాల్ చేయగా.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య పేర్కొన్నారు.
సూసైడ్ నోట్ లభ్యం..
- రామరాజు నివాసంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక భారం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రామరాజు సూసైడ్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




