Sravan Muddu Bidda | కాంగ్రెస్ నేతల నుంచి ప్రాణహాని ఉంది : తెలంగాణ ముద్దుబిడ్డ శ్రవణ్
Sravan Muddu Bidda | స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, మల్లాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు నిమ్మల సాయి శ్రవణ్ రెడ్డి పేర్కొన్నారు.
Sravan Muddu Bidda | త్రినేత్ర న్యూస్ : స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, మల్లాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు నిమ్మల సాయి శ్రవణ్ రెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్ స్వామి వివేకానంద నగర్‌లోని తన నివాసంలో శ్రవణ్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
గత 15 రోజులుగా తనపై వ్యక్తిగతం దాడికి పాల్పడుతున్నారు. లేని ఆరోపణలు చేస్తున్నారు. మా బెడ్రూం అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో తమ తండ్రి వెంకట్ రెడ్డి మొబైల్ ఫోన్ కూడా పగిలిపోయింది.. ఆయన తలకు కూడా గాయమైందని, తన కుటుంబానికి తక్షణమే భద్రత కల్పించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఆయన ఘాటుగా హెచ్చరించారు. తనకు ప్రాణహాని ఉన్నందున పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించాలని పోలీసు శాఖను కోరారు.
అనంతరం తల్లిదండ్రులు వెంకట్ రెడ్డి, అమృత మాట్లాడుతూ.. స్థానిక కాంగ్రెస్ నేత నెమలి రవికుమార్, నెమలి సందీప్ కలిసి తమ కుమారుడిపై దాడులకు పాల్పడుతున్నారు. తమ కుమారుడికి ఏమైనా జరిగితే నెమలి కుటుంబంతో పాటు సూర్య చంద్ర యూత్ కారణమని వాపోయారు. తమకు సంతానం కలగకపోతే.. దత్తత తీసుకున్నాం. తమకు డీఎన్ఏ టెస్టు చేయించే అవసరం నెమలి రవికి ఎందుకు అని ప్రశ్నించారు.
శ్రవణ్ ఏడో తరగతి నుంచే బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనడం స్థానిక కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు పని కట్టుకుని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి శ్రవణ్‌ను దూరం చేస్తున్నారు. తమ కుమారుడికి లక్ష్మారెడ్డితో ఎలాంటి విబేధాలు లేవన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో లక్ష్మారెడ్డితో కలిసి పని చేస్తామన్నారు.
తాజావార్తలు
- ●Comedy OTT | డైరెక్టర్‌గా ఓటీటీలోకి టాలీవుడ్ కామెడీ మూవీ - హైపర్ ఆది పంచ్‌లు హైలైట్
- ●Kavitha | వరుణ యాగం చేసి జనాల ఖర్మకు వదిలేశాడు
- ●Harish Rao | రేవంత్ రెడ్డి పులి కాదు.. ఊసరవెల్లి
- ●Anushka vs Rashmika Mandanna | రష్మిక వర్సెస్ అనుష్క - మైసాకు పోటీగా జేజమ్మ మలయాళం మూవీ
- ●John Wesley | 13 కోట్ల ఓట్లను తొలగించడానికి జ్ఞానేశ్ కుమారే కారణం
- ●Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు

Comedy OTT | డైరెక్టర్‌గా ఓటీటీలోకి టాలీవుడ్ కామెడీ మూవీ - హైపర్ ఆది పంచ్‌లు హైలైట్

Kavitha | వరుణ యాగం చేసి జనాల ఖర్మకు వదిలేశాడు

Harish Rao | రేవంత్ రెడ్డి పులి కాదు.. ఊసరవెల్లి

Anushka vs Rashmika Mandanna | రష్మిక వర్సెస్ అనుష్క - మైసాకు పోటీగా జేజమ్మ మలయాళం మూవీ



