త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SHE Teams | నుమాయిష్‌లో పోకిరీల ఆట‌క‌ట్టు.. 264 మందిని రెడ్‌హ్యాండెగా ప‌ట్టుకున్న షీ టీమ్స్

SHE Teams | నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో 45 రోజుల‌పాటు జ‌రిగిన నుమాయిష్‌లో (Numaish) హైద‌రాబాద్‌ షీ టీమ్స్ (SHE Teams) పోకిరీల ఆట‌క‌ట్టించింది. ఈవ్ టీజ‌ర్లు, వేధింపుల‌కు పాల్ప‌డే వారిపై డేగ‌క‌న్ను వేసి ఉంచిన షీ టిమ్స్ బృందాలు డెకాయ్ ఆప‌రేషన్ల ద్వారా మొత్తం 264 మందిని ప‌ట్టుకున్నారు.

G

Hyderabad | Published On Feb 25, 2026, 12.03 pm IST

SHE Teams | నుమాయిష్‌లో పోకిరీల ఆట‌క‌ట్టు.. 264 మందిని రెడ్‌హ్యాండెగా ప‌ట్టుకున్న షీ టీమ్స్
Advertisement

SHE Teams | త్రినేత్ర‌.న్యూస్‌: నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో 45 రోజుల‌పాటు జ‌రిగిన నుమాయిష్‌లో (Numaish) హైద‌రాబాద్‌ షీ టీమ్స్ (SHE Teams) పోకిరీల ఆట‌క‌ట్టించింది. ఈవ్ టీజ‌ర్లు, వేధింపుల‌కు పాల్ప‌డే వారిపై డేగ‌క‌న్ను వేసి ఉంచిన షీ టిమ్స్ బృందాలు డెకాయ్ ఆప‌రేషన్ల ద్వారా మొత్తం 264 మందిని ప‌ట్టుకున్నారు. వారిలో 242 మంది మేజ‌ర్లు, 22 మంది మైన‌ర్లు ఉన్నార‌ని మహిళల భద్రతా విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్‌జేపీ తెలిపారు.

వారిలో 188 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వ‌హించి హెచ్చరించి పంపామ‌ని చెప్పారు. తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడిన 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశామ‌ని వెల్ల‌డించారు. న్యాయపరమైన చర్యల్లో భాగంగా 52 మందికి రూ.1050 విధించామ‌ని, న‌లుగురి రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా ప‌డింద‌న్నారు. మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

కేవలం శిక్షించడమే కాకుండా, నివారణ, అవగాహన కల్పించడమే ప్రధాన వ్యూహంగా షీ టీమ్స్ చ‌ర్య‌లు తీసుకున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్, పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో 385 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామ‌న్నారు. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచడంతోపాటు 2046 అబ్జర్వేషన్ డ్రైవ్‌లు, 414 ఏవీ (AV) వెహికల్ ప్రచారాల ద్వారా ఆడియో-విజువల్ వాహనాల ద్వారా వేలాది మందికి అవగాహన కల్పించామ‌న్నారు.

సోషల్ మీడియాలో నమ్మకాన్ని సొమ్ము చేసుకునే నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని షీ టీమ్స్ సూచించింది. సోషల్ మీడియాలో అతిగా వ్యక్తిగత వివరాలను పంచుకోవ‌ద్ద‌ని, స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లను వాడ‌టంతోపాటు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' తప్పనిసరిగా ఆన్ చేసుకోవాల‌ని తెలిపింది. వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉంటే అది నేరస్తుడికి రక్షణనిస్తుందని, వేధింపులు, స్టాకింగ్ (వెంబడించడం), బెదిరింపులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాల‌ని కోరింది. ఫిర్యాదుదారుల‌ వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు. సహాయం లేదా ఫిర్యాదుల కోసం డ‌య‌ల్‌ 100, వాట్సాప్ నంబ‌ర్ 94906 16555లో సంప్ర‌దించవ‌చ్చ‌ని పేర్కొంది.

Advertisement
Advertisement