త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramzan | ముస్లిం విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. పాఠ‌శాల వేళ‌ల్లో స్వ‌ల్ప‌మార్పు..!

Ramzan | హైద‌రాబాద్ ప‌రిధిలోని ముస్లిం విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రంజాన్ మాసం నేప‌థ్యంలో మైనార్టీ విద్యాసంస్థ‌ల‌ వేళ‌ల్లో స్వ‌ల్ప‌మార్పులు చేశారు.

S

Hyderabad | Published On Feb 20, 2026, 6.28 pm IST

Ramzan | ముస్లిం విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. పాఠ‌శాల వేళ‌ల్లో స్వ‌ల్ప‌మార్పు..!
Advertisement

Ramzan | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ ప‌రిధిలోని ముస్లిం విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రంజాన్ మాసం నేప‌థ్యంలో మైనార్టీ విద్యాసంస్థ‌ల‌ వేళ‌ల్లో స్వ‌ల్ప‌మార్పులు చేశారు. ఉద‌యం 7.45 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.15 గంటల వ‌ర‌కే త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం వేళ విద్యార్థులు ఉప‌వాస దీక్ష‌లు విర‌మించేందుకు అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పిన విష‌యం తెలిసిందే. రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో వ‌చ్చే నెల 20వ తేదీ వ‌ర‌కు మొత్తం ముస్లిం ఉద్యోగులకు పనిగంటల్లో మినహాయింపులు కల్పించింది. సాయంత్రం 4 గంట‌ల‌కే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement