త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Sarovar | మ‌ధు పార్క్ రిడ్జ్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజేంద్ర‌న‌గ‌ర్ ఆర్డీవో

Gandhi Sarovar | మూసీ న‌ది ఒడ్డున చేప‌ట్ట‌బోయే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు నిమిత్తం భూసేక‌ర‌ణ కోసం కాంగ్రెస్ స‌ర్కార్ క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసింది.

S

Hyderabad | Published On Feb 24, 2026, 2.06 pm IST

Gandhi Sarovar | మ‌ధు పార్క్ రిడ్జ్‌ను స్వాధీనం చేసుకుంటాం :  రాజేంద్ర‌న‌గ‌ర్ ఆర్డీవో
Advertisement

Gandhi Sarovar | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ న‌ది ఒడ్డున చేప‌ట్ట‌బోయే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు నిమిత్తం భూసేక‌ర‌ణ కోసం కాంగ్రెస్ స‌ర్కార్ క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసింది. ఈ క్ర‌మంలోనే కిస్మ‌త్‌పురా, ద‌ర్గాలో డివిజ‌న్ల ప‌రిధిలో భూసేక‌ర‌ణ కోసం నోటిఫికేష‌న్ జారీ చేసినట్లు రాజేంద్ర‌న‌గ‌ర్ ఆర్డీవో వెంక‌ట్ రెడ్డి తెలిపారు.

మూసీ సుందరీకరణలో భాగంగా భూ సేకరణ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేశాం. బండ్లగూడ జాగీర్, ఉప్పర్‌పల్లిలో కూడా నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ కూడా 50 మీటర్ల‌ బ‌ఫ‌ర్ జోన్‌లో ఉంది. 2004లో 12 మీట‌ర్లు బ‌ఫ‌ర్ జోన్ ఉంది. 2012లో 50 మీట‌ర్ల‌కు పెరిగింది. అయితే గ‌తంలో అన్ని అనుమ‌తులు తీసుకొని నిర్మాణం చేప‌ట్టారు. కానీ మార్కెట్ రేటు ప్ర‌కారం ధ‌ర చెల్లించి, ఆ అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని ఆర్డీవో స్ప‌ష్టం చేశారు.

ఉన్నఫలంగా అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోం.. దశల వారీగా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 50 మీటర్ల లోపు ఉన్న నివాసాలు స్వాధీనం చేసుకుంటాం. పారదర్శకంగా భూ సేకరణ చేసి, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాం. ప్రాథ‌మిక నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో అభిప్రాయాలు తీసుకుంటాం. మొత్తం ల్యాండ్ విస్తరణ 83 ఎకరాల 13 గుంటల భూమిని సేకరిస్తున్నట్టు రాజేంద్ర‌న‌గ‌ర్ ఆర్డీవో పేర్కొన్నారు.

Advertisement
Advertisement