Door Step Delivery | డోర్ స్టెప్ డెలివరీ ద్వారా పౌర సేవలు
Door Step Delivery | ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మీసేవ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతమైంది.
మీసేవ, సైబరాబాద్ మున్సిపల్, పోలీస్, సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త కార్యక్రమం
ప్రజా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వ శాఖలు, పౌర సంస్థల సమన్వయం
సైబరాబాద్ పరిధిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యం
Door Step Delivery | త్రినేత్ర న్యూస్ : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మీసేవ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతమైంది.
సైబరాబాద్ పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో ఉన్నతాధికారులు పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ, మీసేవ కమిషనర్ టీ. రవికిరణ్ హాజరయ్యారు.
మీ-సేవ డోర్‌స్టెప్ డెలివరీ.. ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే
కార్యక్రమంలో భాగంగా మీసేవ అందిస్తున్న డోర్‌స్టెప్ డెలివరీ (DSD) సేవల గురించి కమిషనర్ రవికిరణ్ ప్రత్యేకంగా వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దార్శనికతతో పౌరసేవలు అత్యంత సులువుగా అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లకుండానే తమ ఇంటి వద్ద నుంచే వివిధ ప్రభుత్వ సేవలను పొందే అవకాశం డోర్ స్టెప్ సర్వీసుల ద్వారా ఉందని అన్నారు. బిజీగా ఉంటే ఐటీ ప్రొఫెషనల్స్ తో పాటు, మీసేవ కేంద్రాల దాకా వెళ్లలేని వృద్దులకూ ఈ సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు.
1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని, జనన, మరణ ధృవీకరణ పత్రాల్లో సవరణలు, పిల్లల పేర్ల నమోదు, కుల ధృవీకరణ పత్రాలు, జనన తేదీ ధృవీకరణ పత్రాలు, EWS సర్టిఫికెట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు, గ్యాప్ సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, OBC సర్టిఫికెట్లు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంలో ఈ విధానం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజా రవాణా, ఆన్‌లైన్ బుకింగ్ సేవలకు డిజిటల్ పరిష్కారం
అలాగే మీ టికెట్ యాప్ (Mee Ticket App) ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను కూడా కార్యక్రమంలో వివరించారు. ఈ యాప్ ద్వారా కొత్త బస్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం, రెన్యువల్, TGSRTC బస్ టికెట్ సేవలు, హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ బుకింగ్, నెహ్రూ జూ పార్క్ తో పాటు, ఇతర పార్కులు, సందర్శనీయ స్థలాల ప్రవేశ టికెట్లను నేరుగా ఈ యాప్ నుంచే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే సౌకర్యాలను పౌరులు వినియోగించుకోవచ్చని తెలిపారు. డిజిటల్ సాంకేతికత ద్వారా ప్రజా రవాణా, వినోద, ఇతర పౌర సేవలను సులభంగా పొందేలా చేయడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
తాజావార్తలు
- ●Kareena Kapoor | దీపావళి ఫొటోషూట్‌పై వివాదం - కరీనా కపూర్‌కు లీగల్ నోటీసులు
- ●Skyroot Aerospace Brazil Deal | హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్' మరో అంతర్జాతీయ ముందడుగు.. బ్రెజిల్‌తో భారీ డీల్
- ●Unimech Aerospace | సరికొత్త రికార్డు సృష్టించిన డిఫెన్స్ స్టాక్.. ఆరు నెలల్లో 110 శాతం లాభం..
- ●Sridhar Babu | రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా జీసీసీలు...
- ●Asha Workers | రేవంత్ రెడ్డి ఆశాల చావు కోరుతున్నాడు..
- ●Ruhani Sharma | విరాట్ కోహ్లి మరదలి తెలుగు మూవీ - నిర్ణయాలు..వాటి పర్యవసానాలతో "ఆల్కహాల్"

Kareena Kapoor | దీపావళి ఫొటోషూట్‌పై వివాదం - కరీనా కపూర్‌కు లీగల్ నోటీసులు

Skyroot Aerospace Brazil Deal | హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్' మరో అంతర్జాతీయ ముందడుగు.. బ్రెజిల్‌తో భారీ డీల్

Unimech Aerospace | సరికొత్త రికార్డు సృష్టించిన డిఫెన్స్ స్టాక్.. ఆరు నెలల్లో 110 శాతం లాభం..

Sridhar Babu | రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా జీసీసీలు...




