Power Cut | ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు.. ఈ ప్రాంతాల్లో కరెంటు కట్..
Power Cut | త్రినేత్ర.న్యూస్: నిర్వహణ పనుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో విత్యుత్ సరఫరా (Power Cut) నిలిపివేయనున్నారు. బంజారాహిల్స్, గ్రీన్‌ల్యాండ్స్, కాప్రా, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, జవహర్‌నగర్, బోడుప్పల్, ఇంద్రానగర్, బౌద్ధనగర్ సహా పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు కోతలు విధించనున్నారు.
Power Cut | త్రినేత్ర.న్యూస్: నిర్వహణ పనుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో విత్యుత్ సరఫరా (Power Cut) నిలిపివేయనున్నారు. బంజారాహిల్స్, గ్రీన్‌ల్యాండ్స్, కాప్రా, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, జవహర్‌నగర్, బోడుప్పల్, ఇంద్రానగర్, బౌద్ధనగర్ సహా పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు కోతలు విధించనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని 11కేవీ ఐఓఏ, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్.22 ఫీడర్ల పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ జూబ్లీహిల్స్ ఎన్ క్లేవ్, ప్లీజెంట్ వ్యాలీ, పోలీస్ లైన్స్ ఫీడర్ల పరిధి, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11కేవీ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్.36 ఎంసీఆర్డీ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ గాయత్రి హిల్స్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో ఉన్న 11కేవీ భరత్ నగర్, అల్లావుద్దీన్ కోఠి ఫీడర్లలోని పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ ఉండదని తెలిపారు. ఇక ఆజామాబాద్ డివిజన్, హైదరా బాద్ సిటీ-2 పరిధిలోని బౌద్ధనగర్, జామైఉస్మానియా రోడ్, గుల్షన్‌నగర్, భోలక్‌పూర్ పరిధిలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మూన్‌కేఫ్, శంకరమఠం మార్కెట్, మౌలానా ఆజాద్‌నగర్, చప్పల్ బజార్, తాళ్లబస్తీ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా కైలాసగిరి ఫీడర్‌లోని హెచ్‌బీ కాలనీ, కైలాసగిరి, లక్ష్మీనగర్, భక్షిగూడ, ఇందిరానగర్, నవోదయనగర్, రాజీవ్‌నగర్, చైతన్యనగర్ పరిసర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోనుంది.
నేరేడ్‌మెట్‌లో..
నేరేడ్‌మెట్ వాజ్‌పాయ్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ 11 కేవీ పీటర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫీసర్స్ కాలనీ, కాకతీయ నగర్, గీతా నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివేకానంద పురం, భరణి కాలనీ, రాఘవేంద్ర నగర్, అమ్మ గూడ తదితర ప్రాంతాల్లో కరెంట్ కోత ఉంటుంది. ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఆర్కే హెచ్ కాలనీ, సాయి నగర్, జేకే కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపోనుంది.
కుషాయిగూడలో..
కుషాయిగూడలోని వాసవీ శివనగర్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు వాసవీ శివ సాయి నగర్, వైష్ణవి ఎన్‌క్లేవ్, సోనియా గాంధీ నగర్, గణేష్ నగర్, మారుతీ ఎన్‌క్లేవ్, శివసాయి నగర్, సామ్రాట్ నగర్, శుభోదయ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ, నాగార్జున నగర్ కాలనీలలో విద్యుత్ బంద్ కానుంది.
చర్లపల్లి సబ్‌స్టేషన్-4 సాయి నగర్ పరిధిలోని ఎంఆర్‌ఆర్ కాలనీ, సుభాష్ నగర్, సాయి నగర్, నాగార్జున నగర్, శ్రీరాం బేకరీ, చక్రిపురం చౌరస్తాలలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కరెంటు సరఫరా నిలిచిపోనుంది. అంబేద్కర్ నగర్ ఫీడర్ పరిధిలోని చిన్న చర్లపల్లి, చర్చి కాలనీ, సిల్వర్ ఓక్ విల్లాస్, రాజీవ్ గృహకల్ప, వి.ఆర్ కాలనీ, విద్యా మారుతీనగర్, అంబేడ్కర్ నగర్, లక్ష్మీ నగర్, నేతాజీ నగర్, డీసీ కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ కట్ చేయనున్నారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఫీడర్ పరిధిలోని ఈసీ నగర్, మహాలక్ష్మీ నగర్, మింట్ కాలనీ, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదు.

బోడుప్పల్, ఇంద్రానగర్ పరిధిలో..
చెట్ల కొమ్మల తొలగింపు, డీసీ పనుల నేపథ్యంలో బోడుప్పల్, ఇంద్రానగర్ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. బోడుప్పల్ సబ్ స్టేషన్ ఉదయనగర్ ఫీడర్‌లోని ఈస్ట్ బృందావన్ కాలనీ, వెస్ట్ బృందావన్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సతీ రెడ్డి కాలనీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, ఇంద్రానగర్ సబ్ స్టేషన్ వివేకానంద ఫీడర్‌లోని మణికంఠనగర్, వివేకానంద నగర్, శ్రీలక్ష్మి నగర్, లెక్చరర్స్ కాలనీ, ఐఐసీటీ కాలనీ, భీం రెడ్డి కాలనీ, అశోక్ నగర్, గ్రీన్ సిటీ కాలనీ, అనగాపురి కాలనీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఉండదు.
అదేవిధంగా ఇంద్రానగర్ సబ్ స్టేషన్ బొల్లిగూడెం ఫీడర్‌లోని బొల్లిగూడెం, అంజయ్య ఎన్‌క్లేవ్, అమ్మసాని వెంకట్ రెడ్డి కాలనీ, ఎస్‌బీఆర్ కాలనీ, టెలిఫోన్ కాలనీ, తజలింగం కాలనీ (ఫేజ్-1), రాజలింగం కాలనీ (ఫేజ్-2), సూరజ్ నగర్, మహాలక్ష్మి నగర్, బాలాజీ నగర్, లక్ష్మారెడ్డి నగర్, హుడా లక్ష్మి నగర్, కేశవ్ నగర్, ఆకృతి టౌన్‌షిప్, ఎన్టీఆర్ స్టాచ్యూ రోడ్‌లో ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ తీసేయనున్నారు.
అజామాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్ ఫీడర్ పరిధిలో కౌసర్‌మసీద్, సంజయ్‌గాంధీనగర్, బీజేపీ ఆఫీ్‌సలేన్, వారాసిగూడ, బౌద్ధనగర్, కనకదుర్గ ఆలయం ఏరియా, మోర్ సూపర్‌మార్కెట్, జామైఉస్మానియా, ఎల్.ఎన్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. మూన్‌కేఫ్, శంకర్‌మఠం మార్కెట్, మౌలానా అజాద్‌నగర్, చప్పల్‌బజార్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కరెంట్ కట్ చేయనున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




