Power Cuts | ఓ వైపు మండుటెండలు.. మరోవైపు విద్యుత్ కోతలు.. అల్లాడిపోతున్న హైదరాబాదీలు
Power Cuts | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. ఈ మండుటెండలకు హైదరాబాద్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Power Cuts | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. ఈ మండుటెండలకు హైదరాబాద్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మండుటెండలకు తోడు.. విద్యుత్ కోతలు కూడా మొదలయ్యాయి. దీంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.
బుధవారం రాత్రి నుంచి విద్యుత్ కోతలు అధికమయ్యాయని నగర ప్రజలు పేర్కొంటున్నారు. విద్యుత్ కోతలపై నగర ప్రజల నుంచి టీజీఎస్పీడీసీఎల్‌కు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎక్స్ వేదికగా కరెంట్ కోతలపై స్పందిస్తున్నారు.
హర్ష్ కనాని అనే నెటిజన్ ఎక్స్ వేదికగా కరెంట్ కోతలపై స్పందించాడు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ కోతలు భారీగా ఉన్నాయి. నిన్న రాత్రి బీహెచ్ఈఎల్ ఏరియాలో పలుమార్లు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఉక్కపోతకు ఇలా కరెంట్ బంద్ చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, కోతల్లేకుండా చూడాలని కోరాడు.
కిషన్ బాగ్‌కు చెందిన అబ్దుల్ బషిత్ కూడా స్పందించారు. నిన్న రాత్రి ఒంటి గంట నుంచి విద్యుత్ సరఫరా లేదు. ఇంత వరకూ ఎవరూ కూడా స్పందించలేదు. విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందన లేదు. బిస్మిల్లా హోటల్ సమీపంలోని కిషన్‌బాగ్‌లోని అసద్ బాబా నగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిలవ్వడం మూలంగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నాడు. ఇంత వరకు దానికి మరమ్మతులు చేపట్టలేదని బషిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
గొల్కోండ డివిజన్‌లోని డైమండ్ హిల్స్ ఏరియాలో నిన్న రాత్రి నుంచి అనేకసార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని మరో నెటిజన్ తెలిపాడు. ఈ విద్యుత్ కోతలకు కారణం ఏంటని ప్రశ్నించాడు. అసలేం జరుగుతుందో తెలియడం లేదు. 25 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది.. మళ్లీ పోయింది ఇప్పటి వరకు కరెంట్ లేదు. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఫిర్యాదు చేస్తే ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నాడు.
విద్యుత్ కోతలపై రోజుకు వేల కొద్ది ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. త్వరలోనే సమస్యను పరిష్కారిస్తామని చెబుతున్నప్పటికీ, విద్యుత్ పునరుద్ధరణ జరగడం లేదు. ఎండాకాలంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని నగర ప్రజలు అధికారులకు విన్నవిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




