త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BR Ambedkar | అంబేద్క‌ర్ జ‌యంతి రోజే విగ్ర‌హం మాయం..

BR Ambedkar | అంబేద్క‌ర్ జ‌యంతి (BR Ambedkar) రోజే విగ్ర‌హం మాయ‌మైన ఘ‌ట‌న హైద‌రాబాద్ ఎల్బీన‌గ‌ర్‌లో చోటుచేసుకున్న‌ది. ఎల్బీన‌గ‌ర్‌లోని (LB Nagar) నంద‌న‌వ‌నంలో ఉన్న ఓ హోట‌ల్ వ‌ద్ద కొత్త‌గా రాజ్యాంగ రూప‌క‌ర్త బాబాసాహెబ్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హాల‌ను సోమ‌వారం ఏర్పాటు చేశారు.

G

Hyderabad | Published On Apr 14, 2026, 11.21 am IST

BR Ambedkar | అంబేద్క‌ర్ జ‌యంతి రోజే విగ్ర‌హం మాయం..
Advertisement

BR Ambedkar | త్రినేత్ర‌.న్యూస్‌: అంబేద్క‌ర్ జ‌యంతి (BR Ambedkar) రోజే విగ్ర‌హం మాయ‌మైన ఘ‌ట‌న హైద‌రాబాద్ ఎల్బీన‌గ‌ర్‌లో చోటుచేసుకున్న‌ది. ఎల్బీన‌గ‌ర్‌లోని (LB Nagar) నంద‌న‌వ‌నంలో ఉన్న ఓ హోట‌ల్ వ‌ద్ద కొత్త‌గా రాజ్యాంగ రూప‌క‌ర్త బాబాసాహెబ్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హాల‌ను సోమ‌వారం ఏర్పాటు చేశారు. పార్టీల క‌తీతంగా నేత‌లంతా పాల్గొన్ని విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించి నివాళుల‌ర్పించారు. అయితే మంగ‌ళ‌వారం తెల్లవారే స‌రికి ఆ విగ్ర‌హాలు క‌నిపించ‌కుండా పోయాయి. ఈ నేప‌థ్యంలో స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అస‌లు విష‌యం వెలుగుల‌కి వ‌చ్చింది.

విగ్ర‌హాల ఏర్పాటుకు అనుమ‌తి లేద‌ని, పోలీసులే అక్క‌డి నుంచి తొల‌గించిన‌ట్లు తెలియ‌డంతో వారంతా అవాక్క‌య్యారు. మంగ‌ళ‌వారం తెళ్ల‌వారుజామున 3 గంట‌ల‌కు పోలీసులు వాటిని తీసుకెళ్లిన‌ట్లు తెలుసుకున్నారు. దీంతో రాజ్యాంగం రాసిన అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డానికి కూడా అనుమ‌తి కావాలా అంటూ పోలీసుల‌పై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement