త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nampally Numaish | 39 రోజుల్లో 18.20 ల‌క్ష‌ల మంది.. నాంప‌ల్లి నుమాయిష్‌కు పోటెత్తిన జ‌నం

Nampally Numaish | నాంప‌ల్లి నుమాయిష్ (Nampally Numaish).. కేవ‌లం షాపింగ్ వేదికే కాదు. ఇదొక సాంస్కృతిక, సంప్ర‌దాయాల‌ మేళ‌వింపు. దేశం నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఒకే వేదిక‌పై కొలువు తీరుతాయి.

G

Hyderabad | Published On Feb 9, 2026, 9.53 am IST

Nampally Numaish | 39 రోజుల్లో 18.20 ల‌క్ష‌ల మంది.. నాంప‌ల్లి నుమాయిష్‌కు పోటెత్తిన జ‌నం
Advertisement

Nampally Numaish | త్రినేత్ర‌.న్యూస్‌: నాంప‌ల్లి నుమాయిష్ (Nampally Numaish).. కేవ‌లం షాపింగ్ వేదికే కాదు. ఇదొక సాంస్కృతిక, సంప్ర‌దాయాల‌ మేళ‌వింపు. దేశం నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఒకే వేదిక‌పై కొలువు తీరుతాయి. 88 ఏండ్లుగా కొన‌సాగుతున్న ఈ వారస‌త్వ వాణిజ్య వేడుక‌కు (Nampally Exhibition) ల‌క్ష‌లాది మంది త‌ర‌లివ‌చ్చి త‌మ అభిరుచికి త‌గిన‌ట్లుగా వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి మురిసిపోతుంటారు.

20 ల‌క్ష‌లు దాటే అవ‌కాశం..

ఈ ఏడాది జ‌న‌వ‌రి 1న ప్రారంభ‌మైన ఎగ్జిబిష‌న్ ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 8) నాటికి 39 రోజులు పూర్తి చేసుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు 18.20 ల‌క్ష‌ల మంది నుమాయిష్‌ను సంద‌ర్శించారు. ఆదివారం ఒక్క‌రోజే 90 వేల మందికిపైగా ఎగ్జిబిష‌న్‌ను తిల‌కించ‌డం గ‌మ‌నార్హం. మ‌రో వారం పాటు కొన‌సాగ‌నున్న నుమాయిష్ ఫిబ్ర‌వ‌రి 15న ముగియ‌నుంది. అప్ప‌టివ‌ర‌కు సంద‌ర్శ‌కుల సంఖ్య 20 ల‌క్ష‌లు దాటే అవ‌కాశం ఉంది. ఈ వారంతంలో రెండో శ‌నివారం, ఆదివారం వ‌రుస సెల‌వులు కావ‌డంతో మ‌రింత మంది ఎగ్జిబిష‌న్‌కు త‌ర‌లిరానున్నారు.

1938లో 100 స్టాళ్లతో ప్రారంభమై..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రతి ఏటా జ‌న‌వ‌రి 1 నుంచి నుమాయిష్ వేడుకలా జరుగుతుంది. 1938లో 100 స్టాళ్లతో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ సందడి ఏ యేటికాయేడు త‌న‌ ప్రత్యేకతను సంతరించుకుంటున్న‌ది. ఈఏడాది 88వ పడిలోకి అడుగుపెట్టిన నుమాయిష్‌లో.. దేశవ్యాప్తంగా తరలివచ్చిన‌ వ్యాపారులతో 1050 స్టాళ్లు కొలువుదీరాయి. ఇక పిల్లలకు కావాల్సిన ఎంజాయ్ మెంట్ కూడా ఓ రేంజ్‌లో ఉన్న‌ది. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాల వరకు ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల వెరైటీలు, డిజైన్లతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన కళాకృతులు, ప్ర‌త్యేక వ‌స్తువులు ఇక్కడ లభించడం విశేషం. అదేవిధంగా బ్యాంకింగ్, బీమా తదితర పెద్దపెద్ద సంస్థలు కూడా ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేసి వ్యాపారం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Advertisement
Advertisement