త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Yadav | గాంధీ భ‌వ‌న్ మేఘా జాబ్ మేళాను యువ‌త ఉప‌యోగించుకోవాలి: ఎంపీ అనిల్ యాద‌వ్‌

Anil Yadav | రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 19 గాంధీ భవన్‌లో మేఘా జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎంపీ అనిల్ యాద‌వ్ తెలిపారు. నిరుద్యోగ యువత అందరూ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని కోరారు.

S

Hyderabad | Published On Jun 14, 2026, 7.02 pm IST

Anil Yadav | గాంధీ భ‌వ‌న్ మేఘా జాబ్ మేళాను యువ‌త ఉప‌యోగించుకోవాలి: ఎంపీ అనిల్ యాద‌వ్‌
Advertisement

Anil Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 19 గాంధీ భవన్‌లో మేఘా జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎంపీ అనిల్ యాద‌వ్ తెలిపారు. 100 కంపెనీలు గాంధీ భవన్‌కు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువత అందరూ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో మాట్లాడారు. విద్యార్థుల జీవితాల‌తో ఆడుకుంటున్న కేంద్రంపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష మందికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. ప్ర‌ధాని మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నడు. కానీ ఉన్న ఉద్యోగాలనే పీకేస్తుండు. మోదీ పాల‌న‌ 12 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయన దేశానికి ఏం చేశాడని సంబరాలు చేస్తున్నారో బీజేపీ నాయ‌కులే చెప్పాలి. ఇందిరా గాంధీ, నెహ్రు, రాజీవ్ గాంధీ పీవీ నర్సింహరావు చేసిన‌ అభివృద్ధికి పేరు మార్చి మోదీ భ‌జన చేస్తుండు. కేటీఆర్ కుటుంబంలో అందరూ వెన్నుపోటు దారులే. ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారో ప్రజలకు తెలుసు అని అనిల్ యాద‌వ్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement