BMT-RI | బసవతారకంలో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్‌పై నర్సింగ్ కాన్ఫరెన్స్..!
BMT-RI | బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) నర్సింగ్‌లో విజ్ఞానం–ఆచరణ మధ్య వారధి అనే అంశంపై బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నర్సింగ్ విభాగం ఒక రోజు నర్సింగ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రుల నుంచి సుమారు 250 మంది నర్సులు పాల్గొన్నారు.
BMT-RI | బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) నర్సింగ్‌లో విజ్ఞానం–ఆచరణ మధ్య వారధి అనే అంశంపై బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నర్సింగ్ విభాగం ఒక రోజు నర్సింగ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రుల నుంచి సుమారు 250 మంది నర్సులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌ను ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు జేఎస్ఆర్ ప్రసాద్, అకడమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సెంథిల్ జే రాజప్ప, మెడికల్ సూపరింటెండెంట్ కే ఫణి కోటేశ్వరరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ కందుల శ్రీవాణి, కేర్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మీనా కుమారి, పీడియాట్రిక్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వీరేంద్ర పాటిల్ సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ప్రారంభంలో కందుల శ్రీవాణి నర్సింగ్ సిబ్బందిలో కనిపిస్తున్న అంకితభావాన్ని ప్రశంసించారు. డాక్టర్ కల్పనా రఘునాథ్ ఆంకాలజీ నర్సింగ్‌లో నిరంతర అభ్యాసం అవసరాన్ని గుర్తు చేశారు. డాక్టర్ సెంథిల్ జే రాజప్ప బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ సంరక్షణలో ఆధారిత వైద్య పద్ధతులు, నాయకత్వ నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథి జేఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ బోన్‌మారో ఇప్పటివరకు 700 బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్లు విజయవంతంగా నిర్వహించిందని, వాటిలో 200కుపైగా చిన్నారుల కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ విజయాల్లో వైద్య బృందాలతో పాటు నర్సింగ్ సిబ్బంది చూపిన క్రమశిక్షణ, నిబద్ధత కీలకమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో టాటా మెమోరియల్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ జాతీయ సంస్థల నిపుణులు కండిషనింగ్ రెజిమెన్స్, ట్రాన్స్‌ఫ్యూజన్ పద్ధతులు, కార్-టీసెల్ థెరపీ, ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో వచ్చే సమస్యలు, సపోర్టివ్ కేర్ నర్సింగ్ మేనేజ్‌మెంట్ అంశాలపై వివరించారు. కేస్ ఆధారిత చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్లు నర్సులకు ప్రాక్టికల్ అవగాహన పెంచాయని పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు రోగి సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడంలో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధ్యాపకులు, సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




