Netflix Eyeline Studios Launched in Hyderabad | నెట్‌ఫ్లిక్స్ వస్తే.. హైదరాబాద్‌కి హాలీవుడ్ వచ్చినట్టే : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ 'ఐలైన్ స్టూడియోస్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, 'ఫ్యూచర్ సిటీ'లో కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని సీఎం బంపర్ ఆఫర్ ఇచ్చారు.
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ 'ఐలైన్ స్టూడియోస్'
- ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ పెట్టండి
- నెట్‌ఫ్లిక్స్‌కి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
Netflix Eyeline Studios Launched in Hyderabad | త్రినేత్ర.న్యూస్ : గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన 'ఐలైన్ స్టూడియోస్' కార్యాలయం హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ స్టూడియోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈవో జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ రాష్ట్రం వ్యాపార పెట్టుబడులకు ఎంత సురక్షితమైనదో వివరిస్తూనే, నెట్‌ఫ్లిక్స్ భవిష్యత్ విస్తరణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Netflix Eyeline Studios Launched in Hyderabad | మా దృష్టి అంతా హాలీవుడ్ పైనే
తనకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని సీఎం పంచుకున్నారు. "నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు చెన్నైలో ఉన్న సినిమా పరిశ్రమను ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మా దృష్టి హాలీవుడ్‌పైనే ఉందని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ రాకతో నా కల నిజం కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే" అని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఫ్యూచర్ సిటీలో మీ ఆఫీస్ పెట్టండి
నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. "మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)'ని నిర్మిస్తున్నాం. మీ విస్తరణకు, పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెట్‌ఫ్లిక్స్ తన కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నా. ప్రపంచంలోని టాప్ 500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ అంటేనే వ్యాపారం.. ఇక్కడ మీ పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది" అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

డీవీడీ అద్దె సంస్థ నుంచి గ్లోబల్ లీడర్‌గా
ఒక సాధారణ డీవీడీ అద్దెకిచ్చే సంస్థ స్థాయి నుంచి నేడు ప్రపంచాన్ని శాసించే ఓటీటీ లీడర్‌గా, అతిపెద్ద మీడియా స్టూడియోగా నెట్‌ఫ్లిక్స్ ఎదగడం ఆదర్శనీయమని సీఎం కొనియాడారు. అంతటి ప్రసిద్ధి చెందిన నెట్‌ఫ్లిక్స్‌కు హైదరాబాద్ సొంతిల్లు లాంటిదని.. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్‌ల వృద్ధి దాదాపు ఒకేలా ఉంటుందన్నారు. ఫుడ్, ట్రావెల్, హిస్టరీ, హెరిటేజ్ వంటి అంశాలను పంచుకోవడంలో నెట్‌ఫ్లిక్స్‌ను, హైదరాబాద్‌ను ప్రపంచమంతా ప్రేమిస్తుందని అన్నారు. ఐలైన్ స్టూడియోస్ రాకతో తెలంగాణ స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ ప్రేక్షకులకు చూపే అద్భుత అవకాశం దొరికిందన్నారు.

క్రీడల అభివృద్ధికి నెట్‌ఫ్లిక్స్ సహకారం కావాలి
క్రీడారంగంపై తెలంగాణ ప్రభుత్వం, నెట్‌ఫ్లిక్స్ ఒకే విధమైన దృష్టి సారించాయని సీఎం తెలిపారు. భవిష్యత్తులో నెట్‌ఫ్లిక్స్ క్రీడా ప్రసార సంస్థగా కూడా మారుతుందని భావిస్తున్నామన్నారు. "తెలంగాణ కూడా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలను పెంచడం, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, అన్ని స్థాయిల్లో ప్రతిభను ప్రోత్సహించడం చేస్తున్నాం. ఈ లక్ష్య సాధనకు నెట్‌ఫ్లిక్స్ సహకారం కావాలి" అని సీఎం కోరారు.

గ్లోబల్, లోకల్ స్థాయిలో నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ కలిసి పెద్ద ఎత్తున విజయాలు సాధిస్తాయని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



