Hyderabad | పాతబస్తీలో ముస్లింల ర్యాలీ.. హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత
Hyderabad | అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ హైదరాబాద్ పాత బస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ హైదరాబాద్ పాత బస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
తంజీమ్ ఏ జాఫెరి ఆధ్వర్యంలో మజార్ ఏ ఇబ్నే ఖటూన్ నుంచి దారుల్‌షిఫా ప్లే గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. అమెరికా - ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాది మంది పాఠశాల విద్యార్థుల్ని పొట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ప్రజానీకానికి మద్దతు ప్రకటించారు. ఇరాన్‌పై దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు. అనేక మంది స్థానిక మత నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత

పాతబస్తీలో భారీ ర్యాలీ నేపథ్యంలో నానక్‌రూమ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. కాన్సులేట్ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోని తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 50 మంది పోలీసులతో కాన్సులేట్ వద్ద ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




