MLC Sravan Dasoju | మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
MLC Sravan Dasoju | హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ పరిధి బస్తీలలో ప్రజలు తీవ్ర సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
MLC Sravan Dasoju | హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ పరిధి బస్తీలలో ప్రజలు తీవ్ర సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ డివిజన్‌లో జేజోళ్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్, అంబేద్కర్ నగర్ బస్తీల్లో బుధవారం ఆయన పర్యటించారు. స్థానిక నాయకులు ఎండీ అక్తర్, రమేష్, బస్వ గౌడ్, రాములు, శశికల తదితరులు ఆయన వెంట ఉన్నారు. బస్తీల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించిన ఆయన, ప్రజల ఆవేదనను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “బస్తీల అభివృద్ధిని పక్కనపెట్టి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలో ప్రభుత్వం మునిగిపోయింది” అని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీ మార్పుల నేపథ్యంలో తన పదవి ఎప్పుడు ఊడిపోతుందో అన్న భయంతో ప్రజా సమస్యలను పట్టించుకోలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. పర్యటనలో బస్తీల్లో ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. డ్రైనేజీ, నాలా పనులు బిల్లుల చెల్లింపుల్లేక మధ్యలోనే ఆగిపోయాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా మహమ్మదియా మస్జిద్ పరిసరాల్లో రోడ్లు, కాలువల పనులు నెలల తరబడి పూర్తికాకపోవడంతో ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది.
అంబేద్కర్ నగర్‌లో గత రెండు నెలలుగా తాగునీటి సరఫరా సక్రమంగా లేదని ప్రజలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల తాగునీరు అందేదని, ఇప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి కూడా నీరు రావడం లేదని వారు వాపోయారు. వచ్చిన నీటిలో కూడా మురుగునీరు కలుస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ప్రస్తావిస్తూ రోడ్లు పాడైపోయాయి, నాలాలు ప్రమాదకరంగా మారాయి. పేపర్ ప్రకటనలతో ‘గ్లోబల్ సిటీ’ అని చెప్పుకోవడం ఎంతవరకు సబబు? అంటూ ప్రశ్నించారు. బస్తీల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా అధికారులు సైతం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే తాము ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పోరాడతామని, అవసరమైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




