త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Sarovar | మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌కు రూ. 1000 కోట్ల‌తో గేటెడ్ క‌మ్యూనిటీ..!

Gandhi Sarovar | మూసీ న‌ది ఒడ్డున గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును త‌ల‌పెట్టిన నేప‌థ్యంలో అక్క‌డున్న మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్టెమెంట్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

S

Hyderabad | Published On Feb 26, 2026, 3.45 pm IST

Gandhi Sarovar | మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌కు రూ. 1000 కోట్ల‌తో గేటెడ్ క‌మ్యూనిటీ..!
Advertisement

Gandhi Sarovar | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ న‌ది ఒడ్డున గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును త‌ల‌పెట్టిన నేప‌థ్యంలో అక్క‌డున్న మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్టెమెంట్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్ గురువారం స‌మావేశ‌మ‌య్యారు. అక్కడ నష్టపోతున్న వారందరికీ రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తామ‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా రూ. 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తుండగా నష్టపోతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లోని 450 ఫ్లాట్స్ య‌జ‌మానుల‌కు న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో వేరే సురక్షితమైన గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లను కేటాయించడం జరుగుతుంది. లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించడం జరగుతుంది అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement