త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manhole | మియాపూర్‌లో విషాదం.. మ్యాన్ హోల్‌లో ప‌డి వ్య‌క్తి గ‌ల్లంతు

Manhole | హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. న‌గ‌రంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభ‌మైన వాన తెల్ల‌వారుజాము వ‌ర‌కు కొన‌సాగింది. ఈ క్ర‌మంలో మియాపూర్‌లోని వైశాలి న‌గ‌ర్ రైల్వే అండ‌ర్ స‌మీపంలో తెరిచి ఉన్న మ్యాన్‌ హోల్‌లో (Manhole) పడి ఓ వ్య‌క్తి గ‌ల్లంత‌య్యారు.

G

Hyderabad | Published On Jul 29, 2026, 8.09 am IST

Manhole | మియాపూర్‌లో విషాదం.. మ్యాన్ హోల్‌లో ప‌డి వ్య‌క్తి గ‌ల్లంతు
Advertisement

Manhole | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. న‌గ‌రంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభ‌మైన వాన తెల్ల‌వారుజాము వ‌ర‌కు కొన‌సాగింది. ఈ క్ర‌మంలో మియాపూర్‌లోని వైశాలి న‌గ‌ర్ రైల్వే అండ‌ర్ స‌మీపంలో తెరిచి ఉన్న మ్యాన్‌ హోల్‌లో (Manhole) పడి ఓ వ్య‌క్తి గ‌ల్లంత‌య్యారు. అత‌డిని హఫీజ్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్యగా గుర్తించారు. అత‌ని ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చేపట్టాయి. మ్యాన్‌హోల్ (Open Manhole) ప‌రిస‌రాల్లో, డ్రైనేజీ మార్గాల్లో గాలింపు సాగిస్తున్నారు. లోప‌ల ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తూ సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అండర్‌పాస్ నాలా మరమ్మతు పనుల సమయంలో బాలయ్య గల్లంతయ్యారు. కాంట్రాక్టర్ వల్లే బాలయ్య గల్లంతయ్యాడని కుటుంబసభ్యుల ఆరోపణ చేస్తున్నారు. కాగా, బాల‌య్య ఆచూకీ ల‌భించేవ‌ర‌కు గాలింపు కొన‌సాగుతుంద‌ని అధికారులు తెలిపారు.

హైదరాబాద్​లో దంచికొట్టిన వర్షం

మ‌రోవైపు హైదరాబాద్‌లో మరోసారి వాన‌ దంచికొట్టింది. మియాపూర్, కూకట్‌పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్ యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్‌పేట, దిల్‍సుఖ్‌నగర్, హయత్‌నగర్‌, నాచారం, కాప్రా తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో రోడ్లపై అడుగు మేర నీరు ప్రవహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అంబర్‌పేట్, కాచిగూడ, సికింద్రాబాద్, మెహిదీపట్నం, లంగర్ హౌస్,కార్వాన్, పాతబస్తీ చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, రాంనగర్, కవాడీగూడ, జవహార్ నగర్, అంబర్‌పేట, కాచిగూడలోనూ వాన ప‌డింది.

Advertisement
Advertisement