త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VC Sajjanar | కల్తీ రహిత హైదరాబాద్ కోసం ‘మహా యజ్ఞం’.. హెచ్-ఫాస్ట్ పనితీరుపై సీపీ సజ్జనర్ ప్రశంసలు

నగర పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. బేగం బజార్‌లోని హెచ్-ఫాస్ట్ (H-FAST) కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

J

Hyderabad | Published On Apr 13, 2026, 10.00 pm IST

VC Sajjanar | కల్తీ రహిత హైదరాబాద్ కోసం ‘మహా యజ్ఞం’.. హెచ్-ఫాస్ట్ పనితీరుపై సీపీ సజ్జనర్ ప్రశంసలు

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్‌ను కల్తీ రహిత నగరంగా మార్చాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైన 'హెచ్-ఫాస్ట్' (H-FAST) బేగం బజార్ కార్యాలయాన్ని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సోమవారం సందర్శించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 117 కేసులు నమోదు చేసి, ఏకంగా 129.34 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేసిన సిబ్బంది పనితీరును ఆయన అభినందించారు. కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తూనే, సిబ్బంది ఎవరైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 108 మంది పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Advertisement

VC Sajjanar | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల ఆట కట్టించేందుకు ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. సోమవారం బేగం బజార్‌లోని హెచ్-ఫాస్ట్ ప్రత్యేక కార్యాలయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ సందర్శించి, వారి పనితీరును సమీక్షించారు.

కార్యాలయ పరిశీలన, సిబ్బందితో భేటీ

తన పర్యటనలో భాగంగా సీపీ సజ్జనర్ కార్యాలయంలోని రిసెప్షన్, ఇన్‌స్పెక్టర్, ఎస్సైల గదులతో పాటు లాకప్‌లు, మహిళా సిబ్బంది విశ్రాంతి గదులను నిశితంగా పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విధుల్లో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆటంకాలను అడిగి తెలుసుకున్న సీపీ.. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

Make Hyderabad Adulteration-Free CP VC Sajjanar Reviews H-FAST Operations Warns Adulterators

అద్భుతమైన ట్రాక్ రికార్డ్: 129 టన్నుల కల్తీ ఆహారం సీజ్

హెచ్-ఫాస్ట్ బృందాల పనితీరుపై ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు నగరవ్యాప్తంగా సాగించిన దాడుల్లో..  నమోదైన కేసులు 117, స్వాధీనం చేసుకున్న కల్తీ ఆహారం 129.34 టన్నులు. అత్యంత తక్కువ సమయంలోనే ఈ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అభినందనీయమని, ఇది సిబ్బంది సామూహిక కృషి ఫలితమేనని ఆయన కొనియాడారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 108 మంది పోలీస్ సిబ్బందికి సీపీ తన చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు.

Make Hyderabad Adulteration-Free CP VC Sajjanar Reviews H-FAST Operations Warns Adulterators

కల్తీ వ్యాపారులకు గట్టి వార్నింగ్.. సిబ్బందికి కీలక సూచనలు

"ఆహార కల్తీ అనేది సమాజానికి పట్టిన చీడ పురుగు. ఇది పౌరుల ఆయుష్షును హరిస్తోంది. హైదరాబాద్‌ను కల్తీ రహితంగా మార్చే ప్రక్రియను ఒక పవిత్రమైన మహా యజ్ఞంలా భావించి, సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేయాలి" అని సీపీ పిలుపునిచ్చారు.

Make Hyderabad Adulteration-Free CP VC Sajjanar Reviews H-FAST Operations Warns Adulterators

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో పోలీసు సిబ్బందికి కూడా ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సిబ్బంది ఎవరూ కూడా అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని, క్రమశిక్షణ తప్పితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీపై జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజలు కూడా పోలీసులకు సమాచారం అందించి భాగస్వాములు కావాలని సీపీ కోరారు.

Make Hyderabad Adulteration-Free CP VC Sajjanar Reviews H-FAST Operations Warns Adulterators

ఈ సమీక్షా కార్యక్రమంలో డీసీపీ (టాస్క్ ఫోర్స్), హెచ్-ఫాస్ట్ హెడ్ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ (ఐపీఎస్), అడిషనల్ డీసీపీ శ్రీ అందె శ్రీనివాసరావు, వివిధ జోన్ల ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Make Hyderabad Adulteration-Free CP VC Sajjanar Reviews H-FAST Operations Warns Adulterators

Advertisement
Advertisement