త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhapur SI Vinay Caught by ACB | మాదాపూర్ ఎస్సైకి ఏసీబీ షాక్: రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వినయ్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. మాదాపూర్ ఎస్సై వినయ్ బాధితుల నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కేసు విషయంలో ఫేవర్‌గా ఉండేందుకు లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై.. చివరకు ఇలా బుక్ అయ్యారు.

J

Hyderabad | Published On Feb 10, 2026, 10.30 pm IST

Madhapur SI Vinay Caught by ACB | మాదాపూర్ ఎస్సైకి ఏసీబీ షాక్: రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వినయ్
Advertisement

Madhapur SI Vinay Caught by ACB | త్రినేత్ర.న్యూస్ : విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సిన పోలీస్ అధికారి అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వినయ్ (SI Vinay) మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు.

కేసు కోసం లక్షల్లో డిమాండ్

పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసు విషయంలో బాధితులకు అనుకూలంగా వ్యవహరించడానికి ఎస్సై వినయ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు పని చేయడానికి ఆయన లక్షల రూపాయలు అడిగారని బాధితులు వాపోయారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

పక్కా ప్లాన్‌తో వల

బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు. పథకం ప్రకారం.. మంగళవారం ఎస్సై వినయ్ బాధితుల నుండి రూ.50,000 (యాభై వేలు) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా (Red-handed) పట్టుకున్నారు.

సోదాలు, విచారణ

ఎస్సై వినయ్ చేతికి రసాయన పరీక్షలు నిర్వహించి, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా లంచాలకు మరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉపేక్షించేది లేదని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement