త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JNAFAU ఫైన్ ఆర్ట్స్ & డిజైన్ ప్రవేశ పరీక్ష- 2026 నోటిఫికేషన్ విడుదల

JNAFA University | హైద‌రాబాద్ న‌గ‌రంలోని మాస‌బ్‌ట్యాంక్‌లోని JNAFA University నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (B.F.A), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Design) కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది.

S

Hyderabad | Published On May 9, 2026, 5.58 pm IST

JNAFAU ఫైన్ ఆర్ట్స్ & డిజైన్ ప్రవేశ పరీక్ష- 2026 నోటిఫికేషన్ విడుదల
Advertisement

JNAFAU | త్రినేత్ర‌.న్యూస్ : మీరు ఇంట‌ర్ పాస‌య్యారా..? అంద‌రి మాదిరిగా డిగ్రీ కాకుండా ఇత‌ర కోర్సులు ఏవైనా చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా ఫైన్ ఆర్ట్స్ రంగంలో స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారా..? లేదా డిజైన్ రంగంలో కొత్త పుంత‌లు తొక్కాల‌నుకుంటున్నారా..? అయితే మీ లాంటి వారి కోస‌మే.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మాస‌బ్‌ట్యాంక్‌లోని JNAFA University నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (B.F.A), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Design) కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది.

కోర్సులు ఇవే..

B.F.A (ఫోటోగ్రఫీ, పెయింటింగ్, యానిమేషన్, VFX, etc.) & B.Design (ఇంటీరియర్ డిజైన్ ).

అర్హ‌త‌లు :

ఇంట‌ర్ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా స‌మ‌ర్పించాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు :

రూ. 2,000 (SC/ST అభ్యర్థులకు రూ1,000)

చివరి తేదీ:

06-06-2026 (లేట్ ఫీజు లేకుండా), 12-06-2026 (లేట్ ఫీజుతో).

పరీక్ష తేదీలు:

20-06-2026: B.F.A (Photography) & B.Design (Interior Design).
21-06-2026: B.F.A (Applied Art, Painting, Sculpture, Animation & VFX).

ద‌ర‌ఖాస్తుల కోసం ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. https://tsbfa.tsche.in 

Advertisement
Advertisement