త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్‌లో అంత‌ర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ. 20 ల‌క్ష‌ల విలువైన బంగారం సీజ్

Hyderabad | హైద‌రాబాద్ బేగం బ‌జార్ ప‌రిధిలో అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. దొంగ నుంచి రూ. 30 ల‌క్ష‌ల విలువైన 206 గ్రాముల బంగారం ఆభ‌ర‌ణాలు, రూ. 2,14,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.

S

Hyderabad | Published On May 18, 2026, 3.38 pm IST

Hyderabad | హైద‌రాబాద్‌లో అంత‌ర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ. 20 ల‌క్ష‌ల విలువైన బంగారం సీజ్
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ బేగం బ‌జార్ ప‌రిధిలో అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. దొంగ నుంచి రూ. 30 ల‌క్ష‌ల విలువైన 206 గ్రాముల బంగారం ఆభ‌ర‌ణాలు, రూ. 2,14,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.

మ‌హారాష్ట్ర‌లోని లాతూర్ జిల్లాకు చెందిన అమ‌ర్ సోన్‌కాంబ్లే(20) కుటుంబం కొన్నేండ్ల క్రితం హైద‌రాబాద్‌కు వ‌ల‌సొచ్చింది. త‌ల్లిదండ్రులు కూడా ఇక్క‌డే స్థిర‌ప‌డ్డారు. కిష‌న్‌బాగ్‌లో నివాస‌ముంటున్నారు. ఇక చిన్న వ‌యసులోనే అమ‌ర్ మ‌ద్యానికి, సిగ‌రెట్ల‌కు అల‌వాటు ప‌డ్డాడు. ఇక డ‌బ్బుల కోసం మొద‌ట ఫంక్ష‌న్ హాల్స్‌లో వెయిట‌ర్‌గా ప‌ని చేసేవాడు. ఈ సంపాద‌న త‌న జులాయి ఖ‌ర్చుల‌కు స‌రిపోక‌పోవ‌డంతో.. దొంగ‌త‌నాల‌కు బానిస‌గా మారాడు. ఈ క్ర‌మంలోనే అమ‌ర్‌పై అనేక కేసులు న‌మోదు అయ్యాయి. పోక్సో కేసు కూడా న‌మోదైంది.

బేగం బ‌జార్, అత్తాపూర్ పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో అత‌నిపై కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఈ నెల 6వ తేదీన గోషామ‌హ‌ల్ ప‌రిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్ప‌డ్డాడు అమ‌ర్. ఇంటి తాళాలు ప‌గుల‌గొట్టి.. 235 గ్రాముల బంగారం, రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అమ‌ర్‌ను అరెస్టు చేయ‌గా, ప‌లు నేరాలు వెలుగు చూశాయి.

తక్కువ వ్యవధిలోనే కేసును చేధించి, నిందితుడిని పట్టుకోవడంతో పాటు దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన బేగం బజార్ పోలీస్ సిబ్బందిని గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement