Cyberabad | 100 మందితో దావత్ చేసుకుంటే.. 3 రోజుల ముందే ఇంటిమేషన్ ఇవ్వాల్సిందే
Cyberabad | హైదరాబాద్ నగరంలో దావత్‌లు ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి. గల్లీల్లో, ఫంక్షన్ హాల్స్‌లో వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే దావత్‌లపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Cyberabad | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరంలో దావత్‌లు ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి. గల్లీల్లో, ఫంక్షన్ హాల్స్‌లో వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే దావత్‌లపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని నివారించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వేడుకల పేరిట ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 100 మందికి పైగా పాల్గొనే ఎలాంటి వేడుక నిర్వహించిన.. మూడు రోజుల ముందే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పోర్టల్ ద్వారా స్థానిక సంస్థకు సమాచారం అందించాలని ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల్లోని రూల్ 5(1)(జే) ప్రకారం ఈ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని సీఎంసీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వేరు చేసిన వ్యర్థాలను కార్పొరేషన్ గుర్తించిన అధీకృత వ్యర్థాల సేకరణదారులు లేదా ఏజెన్సీలకు మాత్రమే అందించాలి అని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నూతన మార్గదర్శకాలపై ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు, ఫంక్షన్ హాల్ యాజమాన్యాలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తాజావార్తలు
- ●Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..
- ●Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు

Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..

Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!

Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!





