Ramchandar Rao | రేవంత్ రిజైన్ చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి
Ramchandar Rao | మున్సిపల్ మంత్రిని దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రాజీనామా చేస్తేనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని గద్దె దింపుతారని, ఇదే మీ ఫ్యూచర్ అని ఎద్దేవా చేశారు.
- నగర ప్రజలు మిమ్మల్ని గద్దె దింపుతారు
- ఇదే మీ ఫ్యూచర్
- మూడు కార్పొరేషన్లలో బీజేపీ గెలుస్తుంది
- అంబర్‌పేట కార్యకర్తల సమావేశంలో రేవంత్‌రెడ్డిపై బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఫైర్
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ మంత్రిని దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రాజీనామా చేస్తేనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. ప్రతిసారి మా ఎంపీలపై నోరు పారేసుకుంటూ రాజీనామా చేయాలని రేవంత్ అనడంపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని గద్దె దింపుతారని, ఇదే మీ ఫ్యూచర్ అని ఎద్దేవా చేశారు. ఉన్న సిటీని వదిలేసి ఫ్యూచర్ సిటీపై పడ్డారన్నారు. ఆదివారం నిర్వహించిన అంబర్‌పేట కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మూడు కార్పొరేషన్లలో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలతో విసిగిపోయిన నగర ప్రజలు నిజమైన మార్పు, సుపరిపాలన కోసం బీజేపీనే ఏకైక ఆశగా చూస్తున్నారన్నారు.

మదర్ ఆఫ్ ఆల్ లైస్‌గా తెలంగాణ..
మూడు కార్పొరేషన్ల పరిధిలో కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలి. కాంగ్రెస్ నాయకులు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రెండున్నరేళ్లలోనే వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ప్రజలకు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మదర్ ఆఫ్ ఆల్ లైస్‌గా తెలంగాణ మారింది. దేశంలోనూ అదే మాదిరిగా అబద్దాలు ఆడుతున్నారు అని రాంచందర్‌రావు ఫైరయ్యారు.
సెక్రెటేరియట్ గేట్ దగ్గర కూర్చొని చర్చిద్దాం..
ప్రభుత్వం ధాన్యం కొనలేని పరిస్థితిలో ఉంది. కొన్నది కూడా ఎమ్మెస్పీ ధర లేకుండా మోసపూరితంగా కొన్నారు. పైగా అతి ఎక్కువ ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొన్నదని పేపర్లలో అబద్దపు ప్రచారం చేశారు. సగం కన్నా ఎక్కువ ధాన్యాన్ని కేంద్రం కొన్నది. మరి నువ్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నవ్ రేవంత్? ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నా. తెలంగాణకు ఏం తేలేదని మా ఎంపీల మీద ఏడుస్తున్నరు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో సెక్రెటేరియట్ గేట్ దగ్గర కూర్చొని చర్చిద్దాం. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు శ్వేత పత్రం విడుదల చేయండి. మేం సమాధానం ఇస్తాం. హైదరాబాద్ ప్రజల చెవుల్లో పూలు పెట్టకండి అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అల్వాల్‌లో తండ్రి బిడ్డలు చనిపోయారు..
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గరే ఉంది. మొన్నటి వర్షానికి అల్వాల్ తండ్రి బిడ్డలను చనిపోయారు. ఇది మీ బాధ్యత కాదా? మీరు రాజీనామా చేస్తారా? హైదరాబాద్‌లో వానలు రావడానికి ముందే అప్రమత్తంగా ఉండాలని తెలియదా? మీరు రిజైన్ చేస్తే కనీసం సిటీ బాగుపడుతుంది. హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని గద్దె దింపుతారు. ఇదే మీ ఫ్యూచర్. అసలు మీకు ఫ్యూచర్ లేదు అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రేమ బంధాన్ని ప్రజలు చూస్తున్నరు..
బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తానీ బయటపడ్డది. ఒకరికొకరు కాపాడుకుంటున్నారు. ఈ రెండు పార్టీలకు ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తున్నది. మీ ప్రేమ బంధాన్ని ప్రజలు చూస్తున్నరు. మూడు కార్పొరేషన్‌లలో బీజేపీని గెలిపించండి. లేదంటే నగరం అభివృద్ధి జరగదు. హైదరాబాద్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధిని చూడండి. అన్నీ స్కీమ్‌లు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని శాఖలు మీ దగ్గరే పెట్టుకుంటే ఏం లాభం. ఎవరికైనా ఇచ్చేయండి. కనీసం శ్రద్ధ పెట్టి పని చేస్తారు. మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు. అది జరగాల్సిందే. వాజ్‌పేయి సహకారంతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. సైబర్ టవర్స్, గచ్చిబౌలి స్టేడియం వంటివి అప్పుడే ఏర్పడ్డాయి. ఇవన్నీ విషయాలు ప్రజల వద్దకు వెళ్లి చెప్పాలి. నిద్రాహారాలు లేకుండా పని చేద్దాం అని రాంచందర్‌రావు పిలుపునిచ్చారు.

నన్ను తరిమికొట్టేవారు ఈ గడ్డమీద పుట్టలే: కిషన్‌రెడ్డి
మెట్రోరైల్‌కి కేంద్రం నిధులు ఇచ్చింది. మెట్రోకి డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తూ మేం రాజీనామా చేస్తాం. హామీలు అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా? నన్ను తరిమికొడతానని రేవంత్ అంటున్నారు. నేను BRS కార్యకర్తని కాదు.. BJP కార్యకర్తని. నన్నుఅడ్డుకునే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా? నన్ను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టలేదు. తెలంగాణ బిడ్డలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. ఎవరు రాజీనామా చేస్తారో రాహుల్, రేవంత్ చెప్పాలి. రేవంత్‌రెడ్డి ఆట మొదలు పెట్టారు. బీజేపీ 2028లో ఆట ముగిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

KTR | చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



